దేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రాల్లో శ్రీశైలం ఒకటి : మోడీ

MODIFదేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రాల్లో శ్రీశైలం ఒకటని చెప్పారు ప్రధాని మోడీ. శ్రీశైల జ్యోతిర్లింగ క్షేత్రం త్రివేణి సంగమ క్షేత్రమని తెలిపారు. శ్రీశైలంలో జరుగుతున్న ఉగాది ఉత్సవాలను పురస్కరించుకొని శనివారం (మార్చి-17) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని దేశ ప్రజలకు సందేశమిచ్చారు. బసవేశ్వరుడు నడయాడిన క్షేత్రం శ్రీశైలమని ప్రధాని అన్నారు. భారతదేశంలోనే శ్రీశైలం ఒక దివ్యక్షేత్రమన్నారు. ఉగాది యుగానికి ఆరంభమన్న మోడీ… సరికొత్త ఆశలు, ఆకాంక్షలతో ఉగాదిని ప్రారంభించాలన్నారు. కర్నాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో ఉగాదిని పవిత్రంగా జరుపుకుంటారన్న మోడీ.. ఉగాది పర్వదినాన కొత్త ఇండ్ల నిర్మాణం, వాహనాల కొనుగోళ్లు లాంటి కార్యక్రమాలను చేపడతారని తెలిపారు. దేశ ప్రజలంతా రేపు ఉగాది పచ్చడిని ఆస్వాదించాలన్నారు. శ్రీశైలం జనజాగృతి సమ్మేళనం కోసం వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివస్తున్నారని తెలిపారు మోడీ. భిన్నత్వంలో ఏకత్వానికి ఈ సమ్మేళనమే నిదర్శనమన్నారు ప్రధాని.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy