దేశంలోనే తొలిసారి: వాట్సప్ లో కోర్టు సమన్లు

khemka iasదేశంలోనే తొలిసారిగా కోర్టు సమన్ లు వాట్సాప్ లో పంపారు ఓ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్. చండీఘడ్ లోని హిస్సార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

ముగ్గురు అన్నదమ్ముల మధ్య ఆస్తివివాదం చెలరేగింది. కలెక్టర్ అశోక్ ఆధ్వర్యంలో సత్తీర్ సింగ్, రామ్ దియాల్, కిషన్ కుమార్ ల మధ్య ఆస్తివివాదంలో విచారణ కొనసాగింది. అన్నదమ్ముల్లో ఒకరైన కిషన్ కుమార్ ఖాట్మండ్ కు వలస వెళ్లాడు. ఆస్తివివాదానికి సంబంధించిన సమన్ లను పంపడానికి అక్కడి చిరునామా ఇవ్వాల్సిందిగా ఫోన్ లో కోరగా.. అతను నిరాకరించాడు.

ఆ సమన్ లను వాట్సాప్ లో పంపవలసిందిగా ఆదేశించారు కలెక్టర్. ఇంటి చిరునామా శాశ్వతం కానప్పుడు.. డిజిటల్ అడ్రస్ కు పంపాలని ఆదేశించారాయన. ఇండయన్ సివిల్ ప్రొసిషర్ కోడ్  జీవో 5, సెక్షన్ 9(2), 9(3), 9(5) ఆధారంగా ఎలక్ట్రానిక్ చిరునామాకు సమన్ లు పంపవచ్చన్నారాయన. ఆ సమన్ లు అతనికి వాట్సాప్ లో చేరినట్టు డెలివరీ అయినట్టు ప్రింటు తీసి దానిపై సంబంధిత న్యాయవాది సంతకం చేస్తే.. అది సాక్ష్యంగా పరిగణిస్తామన్నారు ఐఏఎస్ ఖేమ్కా.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy