దేశంలోనే మొదటిసారి.. తెలంగాణ కానిస్టేబుల్ కు శౌర్యచక్ర

17796037_1141691522627683_1277149780119879660_nనల్గొండ జిల్లాకు చెందిన తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ కె.శ్రీనివాస్ కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ లో ఏప్రిల్ 6న శౌర్యచక్ర అవార్డు ప్రదానం చేశారు. మోస్ట్‌వాంటెడ్‌ ఉగ్రవాది ఆలమ్‌ జెబ్‌ అఫ్రిదీని 2016 జనవరి 23న బెంగళూరులో వీరోచితంగా పట్టుకున్నందుకుగాను ఆయనకు ఈ అవార్డు దక్కింది.

తెలంగాణ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ (సీఐ) సెల్‌ హెడ్‌–కానిస్టేబుల్‌ (హెచ్‌సీ) కుకడపు శ్రీనివాసులు ఉగ్రవాది అఫ్రిదీ చేసిన కత్తిదాడిలో తీవ్రంగా గాయపడి రక్తమోడుతున్నా.. తన ప్రాణాలు ఫణంగా పెట్టి విధులు నిర్తర్వించాడు. 2016లో ఆగస్టులో ఈ శౌర్యచక్ర అవార్డు ప్రకటించింది ప్రభత్వం. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఇద్దరు పోలీసు అధికారులతో సహా మొత్తం 12 మందికి శౌర్యచక్ర అవార్డులను ప్రకటించారు. దేశంలోనే తొలిసారి ఓ కానిస్టేబుల్ ఈ అవార్డుకు ఎంపికయ్యాడు.

1998లో నల్గొండలో కానిస్టేబుల్‌గా డిపార్ట్ మెంట్ లోకి అడుగుపెట్టారు శ్రీనివాసులు. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ దళం అయిన గ్రేహౌండ్స్‌లో కొద్దికాలం పనిచేశాడు. హైదరాబాద్‌ కమిషనరేట్, టాస్క్‌ఫోర్స్ డిపార్ట్ మెంట్స్ లో సుదీర్ఘకాలం సేవలు అందించారు. ప్రస్తుతం కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్‌లో పని చేస్తున్నారు. ఐసిస్‌కు అనుబంధంగా.. దేశవ్యాప్తంగా పేలుళ్ళకు కుట్రపన్నుతున్న JKH సంస్థకు చెందిన ఉగ్రవాదుల్ని NIA అరెస్ట్ చేసింది. ఉగ్రవాదుల ప్రధాన శిక్షకుడిగా కీలకపాత్ర పోషించారు ఆలమ్‌ జెబ్‌ అఫ్రీది.

గుజరాత్‌కు చెందిన అఫ్రిదీపై దేశ వ్యాప్తంగా 25 వరకు పేలుళ్ళు, పేలుళ్ళకు కుట్ర, విద్రోహక చర్యలకు పాల్పడినట్టు పలు కేసులు నమోదై ఉన్నాయి. 2008 నుంచి పరారీలో ఉన్నాడు అఫ్రిదీ. బెంగళూరులో మెకానిక్‌ గా దొడ్డినాగమంగళం ప్రాంతంలో నివసిస్తున్నట్లు సీఐ సెల్‌ అధికారులు 2016 జనవరి 23న గుర్తించారు. శ్రీనివాసులుతో పాటు మరో ముగ్గురితో కూడిన బృందం బెంగళూరు చేరుకుంది.

కొన్ని రోజులు అబ్జర్వేషన్ చేశాక ఆపరేషన్ కు వెళ్లిన నలుగురు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. పోలీసులకు చిక్కకూడదనే ఉద్దేశంతో అఫ్రిదీ శ్రీనివాసులును కత్తితో పొత్తికడుపులో పొడిచాడు. ఈ దాడిలో శ్రీనివాసులు పేగులు బయటకు వచ్చాయి. అయినా లెక్కచేయని శ్రీనివాసులు అఫ్రీదిని ఒదలకుండా పట్టుకోవడం పైనే దష్టిపెట్టారు. ఉగ్రవాదికి తప్పించుకునే అవకాశం ఇవ్వలేదు. పోలీసు బృందాలు అక్కడకు చేరుకుని అఫ్రీదిని అరెస్టు చేశారు.

ఉగ్రవాది చేతికి బేడీలు వేసేంత వరకు గాయపడ్డ శ్రీనివాసులు ఆస్పత్రికి వెళ్లలేదు. 20 రోజులు బెంగళూరు ఆస్పత్రిలోనే చికిత్స పొందారు కానిస్టేబుల్ శ్రీనివాసులు. విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి, ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు శ్రీనివాసులుకు ప్రభుత్వం శౌర్యచక్ర అవార్డును గతేడాది(2016) ప్రకటించగా.. ఈ ఏడాది(2017) అందజేసింది. శ్రీనివాసులు ఢిల్లీ అశోక్ హాల్లో అవార్డు అందుకుంటుండగా.. సొంత రాష్ట్రం తెలంగాణలో హర్శం వ్యక్తం చేశారు బంధువులు, అధికారులు, పోలీస్ బాస్ లు. సోషల్ మీడియాలో అభిమానులు కానిస్టేబుల్ శ్రీనివాస్ కు అభినందనలు వెల్లువెత్తాయి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy