దేశంలో 100 స్మార్ట్ సిటీలు-వెంకయ్యనాయుడు

VENKAYAవంద కొత్త స్మార్ట్ సిటీలను నిర్మస్తామన్నారు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు. ఈరోజు ఉదయం పట్టణాభివృద్ధి మంత్రిగా ఆయన బాధ్యలు చేపట్టారు. పట్టణాల్లో నివసించే జనాభా పెరుగుతోందని…అందుకే పట్టణ రవాణా వ్యవస్థలను మెరుగుపరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుతం పట్టణాల్లో 25 శాతం మంది జనాభా ఉంటున్నారని…2015 నాటికి జనాభాలో సగం మంది నివసిస్తారని చెప్పారు. దేశంలో 7, 935 పట్టణాలున్నాయని లెక్కలు చెప్పారు. అలాగే గృహ నిర్మాణాలను ప్రోత్సహిస్తామన్నారు వెంకయ్య నాయుడు. 2020 నాటికి దేశంలో ప్రజలందరికీ పక్కా ఇళ్ళు నిర్మించి ఇస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో శాటిలైట్ టౌన్ షిప్ లను నిర్మిస్తామన్నారు వెంకయ్య నాయుడు. ప్రధాన నగరాల్లో మెట్రో ట్రైన్ పనులను వేగంవంతం చేస్తామని హామీ ఇచ్చారు. పట్టణాలను క్లీస్ అండ్ గ్రీన్ గా తీర్చుదిద్దుతామని చెప్పారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy