దేశం సంక్షోభంలో ఉంది : ఏచూరి

sitaram-yechuryసీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి మరోసారి ఎన్నికయ్యారు. ఆదివారం (ఏప్రిల్-22)న జరిగిన పార్టీ మహా సభల ముగింపులో …ఏచూరిని ఎన్నుకోవడంతో పాటు.. పొలిట్ బ్యూరోను నియమించారు. 95 మందితో కేంద్ర కమిటీని విస్తరించారు. మలక్ పేట నుంచి వేలాది కామ్రేడ్లు.. సరూర్ నగర్ వరకూ కవాతు చేశారు. సరూర్ నగర్ బహిరంగ సభ లో సీపీఎం నేతలు.. కేంద్రంపై పోరాటమే లక్ష్యమన్నారు. తెలంగాణ గడ్డపై మళ్లీ ఎర్ర జెండా ఎగురుతుందన్నారు.. CPM జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి. ఎన్నికల హామీల అమలులో కేంద్రం విఫలమైందని.. సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన సీపీఎం బహిరంగ సభలో అన్నారు. మతోన్మాద రాజకీయాలు చేస్తున్న కేంద్రాన్ని ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు.

మోడీ ప్రభుత్వంలో ఆర్థిక దోపిడీ ఎక్కువైందని సీపీఎం జాతీయ నేతలన్నారు. కమ్యూనిస్ట్ ఉద్యమాలకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తినిచ్చిందని చెప్పారు. దళితులపై దాడులు పెరిగాయనీ.. కేంద్రం తీరుకు వ్యతిరేకంగా పోరాడతామని అన్నారు. అంతకు ముందు.. మలక్ పేట నుంచి సరూర్ నగర్ వరకు వేలాది సీపీఎం కార్యకర్తలు కవాతు చేశారు. జాతీయ నాయకురాలు బృందా కరత్.. ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. పార్టీ కేంద్ర కమిటీ సమావేశాల్లో.. 17 మందితో పొలిట్ బ్యూరోను పునర్ వ్యవస్థీకరించారు. 95 మందితో కేంద్ర కమిటీ నియామకమైంది. గతంలో కేంద్ర కమిటీలో 92మంది ఉండగా… ఈ సారి మరో ముగ్గురిని తీసుకున్నారు. రాష్ట్రం నుంచి కేంద్రకమిటీలో తమ్మినేని వీరభద్రం, వీరయ్య కొనసాగుతుండగా… కొత్తగా నాగయ్యకు అవకాశం దక్కింది.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy