దేశభక్తి ఎక్కువే: హర్యానాలో జెండా ఎగరేసిన వానరం

maruthi-1171వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వింత చోటు చేసుకుంది. హర్యానాలోని అంబాలాలో జరిగిన వేడుకల్లో ఓ కోతి జెండా ఎగరేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. వివరాల్లోకి వెళితే.. అంబాలాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో జెండా ఎగురవేసేందుకు ప్రిన్సిపాల్ బిల్డింగ్ పైకి వెళుతున్నారు. ఆ సమయంలో కింద ఉన్న పిల్లలు విస్తుపోయే ఘటన చోటుచేసుకుంది. ప్రిన్సిపాల్ పతాకావిష్కరణ చేసేలోపే ఓ వానరం ఒక్కసారిగా పైకెక్కి జాతీయ జెండాను ఎగరేసింది. దీనిని చూసిన అక్కడున్నవారంతా షాక్ అయ్యారు. క్షణాల్లో ఘటన జరిగిపోవడంతో ఎవరూ ఏమీ చేయలేకపోయారు. అయితే ఇది జరుగుతున్నప్పుడు మరో వానరం అక్కడే ఉండటం విశేషం. ఈ వీడియోను చూసినవారంతా దీనిని షేర్ చేస్తున్నారు. అయితే ఈ ఉదంతంలో తప్పెవరిదనేది అధికారులు తేల్చాల్సి ఉంది.

https://www.youtube.com/watch?v=1HMCb6wx_R4

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy