దేశవ్యాప్తంగా ఈ 12న బీజేపీ MPల నిరసన

amitshahపార్లమెంట్‌లో ప్రతిపక్షాల తీరును నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఈ నెల 12న నిరసన కార్యక్రమానికి బీజేపీ పిలుపునిచ్చింది. ప్రధాని నరేంద్రమోడీ సహా బీజేపీ MPలంతా ఈ 12న నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. మోడీ, అమిత్ షా మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సమావేశాలు జరిగిన తీరుపై సమీక్షించారు. విపక్షాల తీరుపై ప్రధాని మోడీ మనస్తాపం చెందినట్లుగా సమాచారం. పార్లమెంట్‌లో విపక్షాల వైఖరిని నిరసిస్తూ ఒకరోజు దీక్ష చేయాలని నిర్ణయించారు. కర్ణాటకలోని హుబ్లీలో జరిగే నిరసన కార్యక్రమంలో అమిత్ షా పాల్గొననున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy