దేశ అభివృద్ధికి కలిసి కట్టుగా శ్రమించాలి: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో ప్రాణాలు అర్పించారన్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. దేశ అభివృద్ధి కోసం అందరం కలిసి కట్టుగా శ్రమించాలన్నారు. దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. పేదరికం నిర్మూలన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. బుధవారం (ఆగస్టు-15) 72వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆల్ ఇండియా రేడియో ద్వారా జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. దేశ ప్రజలకు ఆయన స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు పురుషులతో సమానంగా అవకాశాలు కల్పించాలన్నారు. ఎందరో త్యాగధనుల ఆశయ ఫలమే మన స్వాతంత్ర్యం. మనం పేదరికం నుంచి స్వాతంత్ర్యం సాధించాలన్నారు. రైతులు, పోలీసులు, సైనికులు, ప్రజలు తమ తమ రంగాల్లో విశేష కృషి చేస్తున్నారన్నారు.

ఆగస్ట్ 15 ప్రతి భారతీయుడికి అత్యంత పవిత్రమైనదన్నారు. త్రివర్ణ పతాకం మన దేశానికి ప్రతినిధి అన్నారు. మన పూర్వీకులు, స్వాతంత్ర్య సమరయోధులు ఎన్నో త్యాగాలు చేశారని… దాని ఫలితమే ఈ స్వాతంత్ర్యం అన్నారు. మహిళలకు నచ్చిన మార్గాన్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ, అవకాశముండాలన్నారు. మహిళలు ప్రతిభాపాటవాలతో కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా, ఉద్యోగాలు చేయాలనుకున్నా విద్యారంగంలో సరైన అవకాశాలు అందుబాటులో ఉండాలన్నారు. వరుసలో ఉన్నప్పుడు తమ ముందు ఉన్నవారి హక్కులను గౌరవించాలన్నారు. అలాంటి వారే… స్వాతంత్ర్య సమరయోధులు కలలు గన్న భారతదేశాన్ని సృష్టించగలరన్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy