మోడీ భాయ్ కా గరం చాయ్

namo_chai_pe_charcha_360_635278288269751741 నరేంద్ర మోడీ తనదైన స్టైల్లో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు.  అహ్మదాబాద్ నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న చాయ్ వాలాలతో చర్చలు జరిపారు. ప్రభుత్వంపై  విశ్వాసం కోల్పోయినపుడు దేశాన్ని నడిపించే నాయకుడ్ని ప్రజలు ఎన్నుకుంటారని ఆయన అన్నారు.

చెత్త ప్రభుత్వం షుగర్ లాంటిదని ఒకసారి వస్తే జీవితాంతం వదలదన్నారు. ఇలాంటి ప్రభుత్వంతో  ప్రజలు ఇబ్బంది పడతారని ఆయన అన్నారు.  ఫుట్ పాత్ టీ స్టాల్స్  పా ర్లమెంట్ లాంటిదన్నారు మోడీ. అక్కడ అన్ని విషయాలు చర్చకు వస్తాయని చెప్పారు.

ఇలాంటి ప్రచారంతో చాలా మంది సాదారణ ప్రజలకు చేరువయ్యాయని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. దేశానికి మంచి పాలన అందించడమే తన లక్ష్యమన్నారు నరేంద్ర మోడీ. దేశంలోని పేదలందరికీ చాయ్ బందువులాంటిదని మోడీ అభిప్రాయపడ్డారు.

దేశంలోని 300 నగరాల్లోని 1000 టీస్టాల్స్ లో మోడీ ప్రచారం నిర్వహించారు. అందులో గుజరాత్ లోని 22నగరాలు ఉన్నాయి.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy