దేశ సరిహద్దులో బ్రహ్మోస్

India's Brahmos supersonic cruise missiles, mounted on a truck, pass by during a full dress rehearsal for the Republic Day parade in New Delhi, India, January 23, 2006. REUTERS/Kamal Kishore/File Photo

పొరుగు దేశాలనుంచి ఎలాంటి ముప్పు రాకుండా ముందస్తుగా చర్యలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. శత్రువుల వ్యూహాలను తిప్పికొట్టేందుకు పకడ్భందీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇండియా-చైనా సరిహద్దులో అత్యంతశక్తిమంతమైన బ్రహ్మోస్ క్షిపణులను మోహరించాలని నిర్ణయించింది. ముఖ్యంగా తూర్పు సరిహద్దు దగ్గర వీటిని మోహరించాలని నిర్ణయించినట్లు.. దీనికి కేంద్రం నుంచి అనుమతులు కూడా వచ్చినట్లు డిఫెన్స్ అధికారులు చెప్పారు.
290 కిలో మీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ముక్కులు ముక్కలు చేయగల సూపర్ సోనిక్ అణు క్షిపణులను భారత్ మోహరించాలని నిర్ణయించింది. మొత్తం రూ.4,300 కోట్ల వ్యయంతో ఈ నాలుగో బ్రహ్మోస్ దళాన్ని సిద్ధం చేయాలని భావిస్తున్నారు. మొత్తం 100 క్షిపణులను సిద్ధం చేయనున్నారు. అలాగే ఐదు మొబైల్ లాంచింగ్ వెహికల్స్ కూడా సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ తరహా క్షిపణులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. చివరి పరీక్ష గత సంవత్సరం 2015, మే నెలలో చేశారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy