దైవ‌బ‌లం: కారు కింద ప‌డ్డా..ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ చిన్నారి

carsబెంగ‌ళూరులో అద్భుతం చోటుచేసుకుంది. కారు కింద రెండేళ్ల‌ చిన్నారి ప‌డినా చిన్న గాయం కూడా కాకుండా ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డింది. ఈ ఘ‌ట‌న ఈ నెల 18న చోటుచేసుకుంది. జేపీ న‌గ‌ర్ పుట్టెన‌హ‌ళ్లిలో త‌న నివాసం ఎదురుగా ఈ చిన్నారి తన అక్కతో క‌లిసి ఆడుకుంటుండ‌గా అక్క‌డే ఓ కారు రివ‌ర్స్ తీసుకుంది. కారు వెన‌కాలే ఉన్న చిన్నారిని డ్రైవ‌ర్ గుర్తించ‌క‌పోవ‌డంతో ఆమెపైనుంచే కారు పోనిచ్చాడు. కారు కింద చిన్నారిని చూసి ఆమె అక్క గ‌ట్టిగా కేక‌లు వేసింది. దీంతో కారు డ్రైవ‌ర్ స‌డెన్ బ్రేక్ వేశాడు. ఇంత‌లోనే అక్క‌డికి వ‌చ్చిన ఓ ఆటో డ్రైవ‌ర్ పాప‌ను ర‌క్షించేందుకు ప‌రుగులు తీశాడు. అయితే దైవ‌బ‌లం గ‌ట్టిగా ఉండ‌టంతో ఆ చిన్నారికి ఎలాంటి ప్రాణాపాయం జ‌ర‌గ‌క‌పోవ‌డంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘ‌ట‌నంతా అక్క‌డే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ‌య్యాయి.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy