
మహమ్మద్ ఆయూబ్ అనే వ్యక్తిపై 10 జిల్లాల్లో 150 కేసులు ఉన్నాయి. అనేక సార్లు జైలుకు వెళ్ళి వచ్చారు. పిడి యాక్ట్ లో కూడా జైలుకు వెళ్ళాడు. అయినా అదే దొంగతనాలు చేస్తున్నాడు. ఇతనికి తోడు సద్దాం ఖురేసి. బాబాలు దొంగతనాల్లో చేదోడు వాదోడుగా ఉంటారు. ముగ్గురిపై గతంలో కేసులున్నాయి. ఇటీవలే జైలు నుంచి పిబ్రవరిలో రిలీజ్ అయి.. 17 చోట్ల దొంగతనాలు చేశారు. ఓ ప్రవేటు ఆసుపత్రి అంబులెన్స్ ను కొని అందులొకి ఆవులను తరలిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా తప్పించుకుంటున్నారు.
దొంగిలించిన ఆవులను తక్కువ ధరకు అమ్ముతూ వచ్చిన డబ్బులతో బెయిల్ తెచ్చుకుని జల్సాలు చేస్తూ మళ్ళీ దొంగతనాలు చేస్తున్నారు. సిసి పుటేజి ఆదారంగా అంబులెన్స్ ను గుర్తించిన పోలీసులు అయూబ్, సద్దాం ఖురేసి లను అరెస్ట్ చేశారు. మరో వ్యకి బాబా పరారిలో ఉన్నారు. వీరి నుంచి ఒక ఆవు, 7 లక్షల 50 వేల నగదు…అంబులెన్స్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు నార్త్ జోన్ డిసిపి సుమతి.