దొంగల బీభత్సం

crime_647_100215111520సిటీలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. నేరెడ్ మెట్ లోని ఓ జువెలరీ షాప్ లో చోరీకి వచ్చిన దొంగలు యజమాని మోహన్ పై దాడికి దిగారు. తలపై సుత్తితో కొట్టి, నోట్లో సల్ఫూరిక్ యాసిడ్ పోసి దారుణంగా వ్యవహరించారు. 10 తులాల బంగారంతో పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు మోహన్ ను హస్పిటల్ కి తరలించారు. అతని పరిస్థితి సీరియస్ ఉందంటున్నారు డాక్టర్లు. నిన్న ఉదయం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టపగలు ఓ షాపులోకి కస్టమర్లులా ప్రవేశించిన దొంగలు.. ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అంతర్ రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠాలు రాష్ట్రంలో తిరుగుతున్న టైంలో జరగటంతో.. ఇది కూడా వాళ్ల పనే అని అనుమానిస్తున్నారు పోలీసులు. చైన్ స్నాచింగ్ పై సీరియస్ గా తీసుకున్న ఖాకీలు ప్రత్యేక బృందాలతో సిటీలో గాలింపు, తనిఖీలు విస్త్రుతం చేశారు.

వనస్థలిపురంలో..

సిటీ శివార్లలో చైన్ స్నాచర్ తన చేతివాటం చూపించాడు. ఉదయం తొమ్మిది గంటల సమయంలో వనస్థలిపురం హైకోర్టు కాలనీలో జయమ్మ అనే మహిళ మెడలోని 4 తులాల చైన్ లాక్కెళ్లారు కేటుగాళ్లు. ఇంటి ముందు నిల్చున్న జయమ్మ దగ్గరకు ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి బలవంతంగా చైన్ లాక్కెళ్లారు. బాధితురాలు ఎల్బీనగర్ పీఎస్ లో కంప్లయింట్ చేశారు.

imagesమొత్తం 14 తులాలు

నిన్న సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నేరేడ్ మెట్, మీర్ పేట్ లో మహిళల మంగళసూత్రాలు, బంగారు చైన్లు ఎత్తుకెళ్లారు. ఈ మధ్యకాలంలో మీర్ పేట్, వనస్థలిపురం, నేరేడ్ మెట్ లలో జరిగిన.. 5 చైన్ స్నాచింగ్ కేసుల్లో మొత్తం 14 తులాల బంగారం దోపిడీ జరిగింది. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఈ కేటుగాళ్లు తమ పని తాము కానిచ్చేసుకుంటున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy