దొంగ ప్రేమ : ఖైదీల కోసం కూలర్లలో బీడీలు, పొగాకు

jail BEEDIవిడుదలైన ఖైదీలు బహుకరించిన వాటర్‌ కూలర్‌ లో బయటపడ్డ వస్తువులు చూసి ఆశ్చర్యపోయారు జైలు అధికారులు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అమృత్‌ సర్‌ సెంట్రల్‌ జైలు అధికారులు వేసవి తీవ్రతను తట్టుకోవడానికి జైల్లోని కొన్నిచోట్ల వాటర్‌ కూలర్‌ లను ఏర్పాటు చేయాలని భావించారు. అయితే ఇటీవలే కొందరు ఖైదీలు జైలు నుంచి విడుదలయ్యారు. వారికి ఈ విషయం తెలిసింది. దీంతో తాము కూడా జైలు కోసం కూలర్‌ బహూకరిస్తామని అభ్యర్థించారు.

అందుకు అధికారులు అంగీకరించడంతో ఓ వాటర్‌ కూలర్‌ ని తెచ్చి వారికి అందజేశారు. అయితే, కూలర్‌ విషయంలో జైలు సిబ్బందికి ఎక్కడో అనుమానం వచ్చింది. దీంతో తెరచిచూసిన అధికారులు కంగుతిన్నారు. అందులో నుంచి ఏకంగా 1 వెయ్యి780 బీడీ కట్టలు, రెండు ప్యాకెట్ల పొగాకు బయటపడ్డాయి. జైలు లోపల ఉన్న తమ సహచర ఖైదీల కోసం విడుదలైన ఖైదీలు ఈ ప్లాన్‌ వేశారని అధికారులు భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మహిందర్‌ సింగ్‌ అనే వ్యక్తికి ఈ ఘటనతో సంబంధం ఉ‍న్నట్టు నిర్ధారణకు వచ్చారు.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy