దోస్త్.. నీ మరణంతో మాటలు రావట్లేదు: అద్వానీ

వాజ్ పేయి మరణంతో.. ఆయన చిరకాల స్నేహితుడు, రాజకీయ సహచరుడు, సీనియర్ బీజేపీ నాయకుడు ఎల్కే అద్వానీ తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. తన బాధను వర్ణించడానికి మాటలు రావడం లేదన్నారు. వాజ్ పేయి మరణంతో బీజేపీ కుటుంబం అంతా విచారంలో మునిగిపోయిందన్నారు.

65 ఏళ్ల పైబడి స్నేహం తమ ఇద్దరిదని చెప్పిన అద్వానీ.. అందరికంటే ఎక్కువ దగ్గరైన ఫ్రెండ్ వాజ్ పేయే అని అన్నారు. ఆయన తనకు సీనియర్ కొలీగ్ కంటే ఎక్కువన్నారు. ఆర్ఎస్ఎస్ లో ప్రచారక్ గా ఉన్నప్పటినుంచి వాజ్ పేయితో జ్ఞాపకాలున్నాయని.. వాటిని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానన్నారు. భారతీయ జనసంఘ్ ఏర్పాటు.. ఎమర్జెన్సీ సమయంలో పడిన సంఘర్షణ.. జనతా పార్టీ ఏర్పాటుకోసం చేసిన ప్రయత్నాలు.. 1980లో బీజేపీ ఏర్పాటుచేసిన సందర్భాలు మరువలేనివన్నారు ఎల్కే అద్వానీ.

దేశంలో కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని స్థాపించిన నాయకుడిగా వాజ్ పేయి పేరు చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు అద్వానీ. అప్పటి ప్రధాని వాజ్ పేయికి డిప్యూటీగా ఆరేళ్లు పనిచేసే అవకాశం తనకు దక్కిందన్నారు. ఒక సీనియర్ గా.. ప్రతి సందర్భంలోనూ వాజ్ పేయి తనను గైడ్ చేశారని… ప్రోత్సహించారని అద్వానీ చెప్పారు.

ఆకట్టుకునే నాయకత్వ లక్షణాలు… మంత్రించినట్టుగా అనిపించే ప్రసంగాలు.. ఆకాశమంత ఎత్తున్న దేశభక్తి భావం.. అన్నిటికీ మించి స్వచ్ఛమైన మానవీయ విలువలు… ఆయనలోని దయ, అణకువ.. సిద్ధాంత పరంగా ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి ఆయన సాధించిన విజయాలు అన్నీ… తనపై తీవ్రప్రభావాన్ని చూపించాయని అన్నారు. తనకు వాజ్ పేయి లేని లోటును ఎవరూ పూడ్చలేరని ఎల్కే అద్వానీ అన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy