ధరల్లో రారాజు : నోరూరించే మామిడి కాయ పచ్చడి

MANGOసమ్మర్  వచ్చిందంటే  ఎండలతో  పాటు …నోరూరించే  మామిడి కాయ  పచ్చడి అందరికీ  గుర్తొస్తుంది. ఈ సీజన్లో  మ్యాంగో  పికిల్  రుచులు  అందరి  ఇళ్లల్లో  ఘుమ ఘుమలాడతాయి. అయితే ఈ సారి ధరలు కూడా రెట్టింపు అయ్యాయంటున్నారు వ్యాపారులు.

పండ్లకు రాజూ మామిడి. ఇక పచ్చడి తయారీలో కూడా మామిడే రాజు. ఎండాకాలంలో ఎవరింట్లో చూసినా మామిడి ఘుమఘుమలు నోరూరిస్తాయి. మామిడి కాయలు  కొనడం…. ముక్కలు కొట్టించడం… కొత్త మిరపకాయలతో కారం పట్టించడం కామన్ గా కనిపిస్తుంది. ఇక అల్లం వెలుల్లి.. నూనెలు… ఆవపిండి తయారీ.. ఇలా పచ్చడి వస్తువుల కొనుగోళ్లతో బిజీగా ఉంటారు మహిళలు. ఏడాది పచ్చడి తయారీకి ఉపయోగించే వాటి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయి. గతేడాది కంటే ఈసారి అన్నింటి ధరలు డబుల్ అయ్యాయని చెబుతున్నారు పబ్లిక్.

సంవత్సరం పాటు మామిడి కాయ పచ్చడి రంగు మారకుండా ఉండాలంటే మంచి కారం వాడాలి. ఈ పచ్చళ్లకు స్పెషల్ గా మిరపకాయలు అమ్ముతుంటారు. దీంతో పచ్చళ్ల సీజన్లో ఎండు మిర్చి రేటు పెరుగుతుంది. గతేడాది కేజీ మిర్చి 60 నుండి 80 రూపాయలు ఉండగా … ఇప్పుడు కేజీ 110 నుండి 180 వరకు పలుకుతుంది. ఇక పచ్చళ్ల తయారీకి అల్లం, మసాలా తప్పనిసరి. క్వాలిటీ  అల్లం, వెలుల్లి వాడితేనే ఏడాదంతా పచ్చడి మంచి రుచిగా ఉంటుంది. అందుకే  సీజన్ ప్రారంభం కాక ముందు 100 రూపాయిలకు  4 కేజీలు పలికిన అల్లం వెలుల్లి ఇప్పుడు… కేజీనే 100 నుండి 120 వరకు పలుకుతుంది.

వెలుల్లి ఐతే కేజీ 60 నుండి 80 రూపాయిల వరకు ఉంది. మామిడి కాయ పచ్చడి తయారీకి వాడే అన్ని వస్తువులు ధరలు ఒక దానితో పోటీ పడి మరొకటి పెరుగుతున్నాయి.  ప్రతి ఏడాది ఈ సీజన్ లో రేట్లు  పెరుగుతాయి. కానీ గతంలో కంటే ఈసారి రేట్లు రెట్టింపయ్యాయిని చెప్తున్నారు వ్యాపారులు.  ఏడాదంతా ఆవకాయ రుచి ఉండాలంటే ధరలు ఎంతున్నా పచ్చడి పెట్టుకోక తప్పదని చెప్తున్నారు జనం.

 

 

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy