ధర్నాచౌక్ పై అఖిలపక్షం ఏర్పాటు చేయాలి: కోదండరామ్

JAC-Kodandaramధర్నాచౌక్ తరలింపు పై శాంతియుతంగా తాము నిరసన తెలుపుతున్నా.. ప్రభుత్వం ఘర్షణపూరిత వాతావరణం సృష్టిస్తోందన్నారు పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరామ్. ఇందిరాపార్కులోని ధర్నాచౌక్ దగ్గర నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులపై ఆయన స్పందించారు. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని కోరామని… ధర్నాచౌక్ తరలింపు అంశంపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

ధర్నాచౌక్ ను ఇందిరాపార్కు నుంచి తరలింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు పోరాడతామన్నారు. అయితే ధర్నాచౌక్ ను ఇక్కడి నుంచి తరలించాల్సిందేనని స్థానికులు, వాకర్స్ అసోసియేషన్ నేతలు కూడా ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికులు, వాకర్స్ అసోసియేషన్ కార్యకర్తలపై వామపక్షాల కార్యకర్తలు దాడులకు దిగారు. పార్టీల జెండా కర్రలు, రాడ్లతో దాడులకు తెగబడటంతో స్థానికులు తీవ్రంగా గాయపడ్డారు. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో కుర్చీలు విరిగిపడ్డాయి.

ఇదిలా ఉండగా.. మఫ్టీలో ఉన్న పోలీసులే స్థానికులపై దాడులు చేశారని కోదండరామ్ ఆరోపించారు. స్థానికులకు తమకు ఎలాంటి విబేధాలు లేవని… ఆయన స్పష్టం చేశారు. ధర్నాచౌక్ తరలింపును సమర్ధిస్తున్న స్థానికులతో తాము చర్చలు జరుపుతున్నామని..వారు కూడా తమకు సంఘీభావం ప్రకటించారని.. దాడులు చేసింది మాత్రం పోలీసులేనని ఆయన మండిపడ్డారు. ఈ అఖిలపక్షాల ధర్నాకు జనసేన కూడా మద్దతు ఇచ్చింది. కార్యకర్తలు కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy