ధర్నాచౌక్ రచ్చ : జేఏసీ Vs లోకల్

dharna-chowk-attackహైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ధర్నాచౌక్ ఉండాలని జేఏసీ ఆధ్వర్యంలో విపక్షాలు – సిటీ శివార్లకు తొలగించాలని స్థానికులు, వాకర్స్ పోటాపోటీగా నిరసనలకు దిగాయి. వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. అప్పటికే ధర్నాచౌక్ తరలిచాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగిన స్థానికులు ఉండటం.. రెండు వర్గాలు ఎదురెదురు పడటంతో ఉద్రిక్తత నెలకొంది. అనుకూల – ప్రతికూల వర్గాల మధ్య నినాదాలతో హోరెత్తింది. తోపులాట జరిగింది. కుర్చీలు విసిరేసుకున్నారు. ఓ స్థానికుడు గాయపడ్డాడు. పోలీసుల సర్దిచెప్పటంతో శాంతించారు. ధర్నాచౌక్ చుట్టూ పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. భారీ ఎత్తున బలగాలు రంగంలోకి దిగాయి. రెండు వర్గాలు పోటాపోటీ నిరసనలతో ఇందిరాపార్క్ ప్రాంతం రణరంగంగా మారింది.

స్థానికుల వాదన : శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే దాడికి దిగారు. కర్రలతో కొట్టారు. నిత్యం ధర్నాలతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. మైక్ సౌండ్ లతో పిల్లల చదువుకు ఇబ్బందిగా ఉంటుంది.

జేఏసీ వాదన : శాంతియుతంగా వస్తుంటే అడ్డుకున్నారు. స్థానికుల ముసుగులో కొందరు రాళ్లు రువ్వారు. ప్రభుత్వం చేయిస్తున్న ధర్నా అది. ప్రజా మద్దతు మాకే ఉంది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy