ధర్మాగ్రహం: వెదర్ డిపార్టుమెంట్ పై కేసు పెట్టిన రైతులు

weather-farmersవాతావరణాన్నితప్పుగా అంచనా వేసినందుకు తమకు పెద్దఎత్తున నష్టం వాటిల్లిందని భారత వాతావరణ విభాగంపై మహారాష్ట్ర సీఎంకు ఫిర్యాదు చేశారు రైతులు. అంతటితో ఆగక పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. రైతుల ఫిర్యాదుతో కేసు పెట్టారు పోలీసులు. భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయానిదే ప్రధాన భూమిక. వ్యవసాయానికి వర్షం ఆయువుపట్టు లాంటిది. అంతటి ప్రాముఖ్యత ఉన్న వర్షం గురించి చెప్పే సంస్థ భావరత వాతావరణ విభాగం.  అలాంటి సంస్థ తప్పుడు సమాచారమిస్తే రైతులు ఘోరంగా నష్టపోతారు. ఇప్పుడు అదే జరిగింది. ఆ విభాగం ఇచ్చిన సమాచారంతో నష్టపోయిన బీడ్‌ జిల్లా మజల్గావ్‌ తాలుకాలోని ఆనంద్‌గావ్‌ గ్రామ రైతులు కేసు పెట్టారు.

విత్తన, ఎరువుల తయారీదారులతో పూణే, కొలబా వాతావరణ విభాగం కుమ్మక్కై ఈ ఖరీఫ్‌ సీజన్‌లో వర్షాలు పుష్కలంగా కురుస్తాయని ప్రకటించినట్లు రైతులు ఫిర్యాదిచ్చారు. వర్షాలు వస్తాయంటూ రైతులను ఐఎండీ తప్పుదోవ పట్టించిందని ఆనంద్‌గావ్‌ గ్రామానికి చెందిన రైతు గంగాభిషేకం తవార్‌ (54) ఆరోపించారు. ఐఎండీ మాట విని తమ ప్రాంతంలో జూన్‌ నెలకు ముందే విత్తనాలు వేశామని, ఎంతో ఖర్చుపెట్టి ఎరువులు, పురుగుమందులు కొన్నామని, కూలీలకు జీతాలు  చెల్లించామని తెలిపారు. కానీ ఇప్పటికీ వర్షాలు రాలేదని దీంతో లక్షల రూపాయలు నష్టపోయామని ఆవేదన వ్యక్తంచేశారు రైతులు. మరోవైపు ఈ విషయంలో జోక్యం చేసుకుని తమను ఆదుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు రైతులు లేఖ రాశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో సీఎంను కోరారు. కాగా, రైతుల ఫిర్యాదును స్వీకరించామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు మజల్గావ్‌ పోలీసులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy