ధీర యువతకు.. వివేకానందుని సింహగర్జన

swamiస్వామి వివేకానంద. భారతదేశ చరిత్రలో మహోన్నతమైన వ్యక్తులలో ఒకరు. యోగి, వేదాంతి, తత్వశాస్త్రంలో సుప్రసిద్ధుడు. భారతదేశ పేరు ప్రఖ్యాతులను ఖండాంతరాలకు తీసుకెళ్లిన మహా వ్యక్తి ఆయన. యువతకు స్పూర్తి ప్రదాతగా నిలిచిన వివేకానందుడి 154వ జయంతి సందర్భంగా వీ6 ప్రత్యేక కథనం..

భారతీయ సనాతన ధర్మం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప వేదాంతి. భారత కీర్తిపతాకాన్ని ఖండాంతరాల్లో రెపరెపలాడించిన తత్వవేత్త వివేకానందుడు. 1863 జనవరి 12న కోల్ కతాలో అడ్వకేట్ విశ్వనాథ్ దత్తా, భువనేశ్వరీదేవి దంపతులకు జన్మించారు వివేకానంద. తండ్రిపెట్టిన పేరు నరేంద్రనాథ్ దత్తా. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఏర్పాటు చేసిన స్కూల్లో విద్యాభ్యాసం ప్రారంభించారు. వేణీగుప్తా, ఉస్తాద్ అహ్మద్ ఖాన్ దగ్గర సంగీతం నేర్చుకున్నారు. హార్మోనియం, ఫిడేల్ పై పట్టుసాధించారు. చిన్నతనం నుంచే లా,  సైన్సు పుస్తకాలు.. ఉపనిషత్తులు, పురాణాలను చదివేవారు.

వివేకానందుడు మల్టీ టాలెంటెడ్ అని చెప్పొచ్చు. ప్రతీ రంగంలోనూ ఆయనికు పట్టుంది. దొరికిన ప్రతీ పుస్తకాన్ని తిరగేసేవారు. అన్ని మత గ్రంథాలను చదివారు. ఆతర్వాత రామకృష్ణ పరమహంస దగ్గర శిష్యరికం చేసి సాధువుగా మారారు. దేశంలోని యువత, ప్రజలు తప్పుదారి పట్టారని భావించిన వివేకానంద.. వారికి మార్గనిర్థేశం చేసేందుకు.. ఎలా బతకాలో తెలిపేందుకు దేశమంతా యాత్ర చేశారు.

1893 సెప్టెంబర్ 11న అమెరికాలో ఆయన చేసిన ప్రసంగం మరువలేనిది. ఆ ఒక్క ప్రసంగంతోనే వివేకానందునికి విశ్వవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఏడేళ్ల పాటు వివేనందుడు అమెరికా, యూరప్ లలో తన గళాన్ని వినిపించారు. రామకృష్ణ పరమహంస కాలం చెందాక ఆయన పేరుమీద మఠాన్ని ప్రారంభించారు. ఆర్కే మఠ్ ను ప్రపంచవ్యాప్తం చేసేందుకు ఎంతో కృషిచేశారు.

దేవుడు ఎక్కడో లేడు మనలోనే ఉన్నాడన్న వివేకానందుడి 154వ జయంతి ఇవాళ. ఆయన బతికిన 39ఏళ్లు అవిశ్రాంతంగా గడిపారు. ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకోవాలన్న తపన ఆయనను మహావ్యక్తిని చేసింది.

వివేకానంద సూక్తుల్లో కొన్ని..

మేలుకో.. నీ మ‌దిని మేలుకొలుపు
గ‌మ్యం చేరే వ‌ర‌కు.. విశ్ర‌మించ‌కు

ఉత్సాహంతో శ్ర‌మించ‌డం..
అల‌స‌ట‌ను ఆనందంగా అనుభ‌వించ‌డం..
ఇవి విజ‌యాన్ని కాంక్షించే వారి ప్రాథ‌మిక ల‌క్ష‌ణాలు

నీలోనే శ‌క్తి అంతా ఉంది..
నీవు చేయాల‌నుకుంటే
ఎంత‌టి అసాధ్యమైన ప‌నినైనా చేయ‌గ‌ల‌వు..
చేయ‌లేన‌నుకుంటే.. ఏ ప‌నీ చేయ‌లేవు

మాన‌వుడు ఎంత గొప్ప‌వాడైతే..
అంత క‌ఠిన‌మైన ప‌రీక్ష‌ల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది

జీవితంలో ధ‌నం కోల్పోతే.. కొంత కోల్పోయిన‌ట్లే..
కానీ వ్య‌క్తిత్వం కోల్పోతే.. స‌ర్వ‌స్వం కోల్పోయిన‌ట్లే

నిత్యచైతన్య స్ఫూర్తి..

ఆయన అవిశ్రాంతంగా పనిచేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింది. 1902 జులై 4న 39ఏళ్ల వయసులో చనిపోయారు వివేకానంద. భూమ్మీద గడిపినన్ని రోజులూ సాధువులా సమాజ హితం కోసం శ్రమించారు వివేకానందుడు. యువతకు స్ఫూర్తిప్రదాతగా నిలిచారు. ఆయన జన్మదినోత్సవం సందర్భంగా ప్రతియేటా యువజనోత్సవాలు నిర్వహిస్తున్నాయి ప్రభుత్వాలు.

One Response to ధీర యువతకు.. వివేకానందుని సింహగర్జన

  1. Hi.Hello friends.i am very happy to study about our great youth icon Swami Vivekanada.Every Indian should read Swami life history to know very well.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy