ధోనీ, జాదవ్ రాక్స్ : వన్డే సిరీస్ మనదే… ఆస్ట్రేలియాపై హిస్టరీ రిపీట్స్

మెల్ బోర్న్ : ఆస్ట్రేలియాలో కోహ్లీగ్యాంగ్ మరో చరిత్ర సృష్టించింది. ఇప్పటికే టెస్ట్ సిరీస్ ను గెలిచి హిస్టరీ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ గ్యాంగ్… ఆస్ట్రేలియాపై తొలిసారి వన్డే సిరీస్ ను గెల్చుకుంది. హిస్టరీ రిపీట్ చేసింది. చివరి వన్డేలో 4 బాల్స్ మిగిలి ఉండగా… 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియాలో ఆ దేశంతో ఫేస్ 2 ఫేస్ జరిగిన వన్డే సిరీస్ ను గెల్చుకోవడం ఇదే మొదటిసారి.

 

మెల్ బోర్న్ లో మహేంద్రజాలం.. జాదవ్ చేసిన అద్భుతం

231 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఇండియాకు.. టార్గెట్ చేజింగ్ అంత ఈజీగా సాగలేదు. చూస్తే స్కోరు తక్కువగానే కనపడినా.. వాతావరణం, బౌలింగ్ కు పిచ్ అనుకూలించిన కారణాలతో.. విజయం కష్టంగానే దక్కింది. రోహిత్ (9), ధావన్ (23), కోహ్లీ(46) వికెట్లను ఇండియా మొదట్లోనే కోల్పోయింది. ఇండియాను సీనియర్ ప్లేయర్, కీపర్ మహేంద్రసింగ్ ధోనీ ఆదుకున్నాడు. 74 బాల్స్ లో 3 ఫోర్లతో 50 రన్స్ పూర్తిచేశాడు. కేదార్ జాదవ్ తో కలిసి వికెట్ల పతనాన్ని అడ్డుకుని.. విజయం దిశగా నడిపించాడు. జాదవ్ కూడా అద్భుతమైన సమన్వయం చూపించాడు. హాఫ్ సెంచరీతో మార్వలెస్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇండియా సాధించిన ఈ అపూర్వమైన, మరపురాని విజయంలో ధోనీ(114 బాల్స్ లో 87 రన్స్… 6 ఫోర్లు), కేదార్ జాదవ్(57 బాల్స్ లో 61 రన్స్… 7 ఫోర్లు) ల ఇన్నింగ్సే హైలైట్. సింగిల్స్, డబుల్స్ తీస్తూ… అవసరమైనప్పుడు బౌండరీలు బాదుతూ…. ఇండియాకు వండ్రఫుల్ విక్టరీ అందించారు. చాలారోజుల తర్వాత.. ధోనీ ఈజ్ బ్యాక్ అనదగ్గ ఫైనెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు.

టాస్ గెలిచిన ఇండియా… ఫీల్డింగ్ ఎంచుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా… 48.4 ఓవర్లలో 230 రన్స్ కు ఆలౌట్ అయ్యింది. వర్షం కారణంగా.. మ్యాచ్ కు కొంత అంతరాయం కలిగింది. బౌలర్లకు అనుకూలించిన ఈ పిచ్ పై ఆస్ట్రేలియా కష్టమ్మీద పరుగులు రాబట్టింది. భారత బౌలర్లు… టైమ్ టు టైమ్ వికెట్లు పడగొట్టి లోకల్ టీమ్ ను కంట్రోల్ చేశారు.  హ్యాండ్స్ కోంబ్ 58, మార్ష్ 39, ఖవాజా 34, మాక్స్ వెల్ 26 రన్స్ తో రాణించారు. స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ ఒక్కడే ఆరు వికెట్లు పడగొట్టాడు.  భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ ఇద్దరూ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

భారత స్పిన్నర్ చాహల్ రికార్డ్ షో

యజ్వేంద్ర చాహల్… 42 పరుగులకు 6 వికెట్లు తీసి.. తన కెరీర్ బెస్ట్ బౌలింగ్ చేశాడు. చాహల్ ఐదు అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టడం ఇది రెండోసారి. మెల్ బోర్న్ స్టేడియంలో ఓ భారత బౌలర్  నమోదు చేసిన అత్యుత్తమ గణాంకాలు కూడా ఇవే. 2004లో అజిత్ అగార్కర్ కూడా 6/42 ప్రదర్శన చేశాడు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy