ధోలా-సాదియా బ్రిడ్జిని ప్రారంభించనున్న ప్రధాని

modi-bridgeదేశంలోనే అత్యంత పొడవైన వంతెన ధోలా-సాదియాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ (మే 26) ప్రారంభించనున్నారు. దీనిని అసోంలోని లోహిత్ నదిపై నిర్మించారు. ఇది బ్రహ్మపుత్ర నదికి ఉపనది. ఈ మూడులైన్ల వంతెన పొడవు 9.15 కిలోమీటర్లు. అసోంలోని సాదియా, అరుణాచల్‌ప్రదేశ్‌లోని ధోలా ప్రాంతాలను కలుపుతూ ఈ వంతెనను నిర్మించారు. మోడీ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లయిన సందర్భంగా ఇవాళ దీన్ని ప్రారంభించనున్నారు. ధోలా-సాదియా వంతెన నిర్మాణానికి పదేళ్ల కిందట అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ శంకుస్థాపన చేశారు. 2014లో మోడీ పదవీబాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని ఆదేశించడంతో మూడేళ్లలోనే పనులు పూర్తయ్యాయి. ఈ వంతెన ప్రారంభమైతే అసోంలోని రుపాయ్, అరుణాచల్‌ప్రదేశ్‌లోని మెకా(రోయింగ్) ప్రాంతాల మధ్య దూరం 165 కిలోమీటర్లు తగ్గనున్నది. ప్రయాణ సమయం 5 గంటలు కలిసిరానున్నది. దీంతో రోజుకు రూ.10 లక్షల మేర ఇంధనం ఆదా కానున్నట్టు కేంద్రం తెలిపింది. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.2,056 కోట్లు. ఇప్పటివరకు బ్రహ్మపుత్రనదిని దాటాలంటే పగటిపూట మాత్రమే పడవల్లో వెళ్లాల్సి వచ్చేదని… వరదల సమయంలో నదిని దాటడం అసాధ్యమయ్యేదని, ఇకపై ఆ కష్టాలు తీరనున్నాయని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. వంతెన ప్రారంభమైతే అసోం, తూర్పు అరుణాచల్‌ప్రదేశ్ మధ్య 24 గంటల రవాణా అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy