నందిమేడారం టన్నెల్ పంప్ హౌస్ ను పరిశీలించిన సీఎం

nandiసీఎం కేసీఆర్  నందిమేడారం చేరుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు అనుబంధంగా నందిమేడారం గ్రామ శివారులో నిర్మిస్తున్న ఆరో ప్యాకేజీ అండర్ టన్నెల్ పంప్ హౌస్ పనులను కేసీఆర్ పరిశీలించారు. టన్నెల్ లో నీటి నిల్వ ఉండే ప్రాంతం సర్జ్ పూల్ ను కూడా పరిశీలించారు. 6, 7 ప్యాకేజీ పనుల పురోగతిపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు అధికారులు.  ఆ తర్వాత ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను తిలకించారు సీఎం.

కాళేశ్వరం ప్రాజెక్టు పథకంలో నందిమేడారం రిజర్వాయర్ అత్యంత కీలకమైనది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని మధ్యమానేరుకు తరలించాలన్నా..SRSP పునర్జీవ పథకానికి ఎత్తిపోయాలన్న ఈ జలాశయమే ఆధారం. కాళేశ్వరం ప్రాజెక్టు లింకు-3 ప్యాకేజీ7లో పెద్దపల్లి జిల్లా ధర్మపురి మండలం నందిమేడారం గ్రామ పరిధిలో దీనిని నిర్మిస్తున్నారు. గతంలో ఇక్కడ పెద్ద చెరువు ఉండేది. 0.16 టీఎంసీల సామర్థ్యంతో ఉన్న ఈ చెరువును ..రిజర్వాయర్ గా మార్చి  0.75 టీఎంసీల సామర్థ్యానికి పెంచింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రోజుకు రెండు టీఎంసీలు ఎత్తిపోయనుండగా, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ముందుగా మేడారం జలాశయానికి పంపిస్తారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మేడారం రిజర్వాయర్ కు ముందుగా 3.6 కిలోమీటర్ల గ్రావిటీ కాలువ ద్వారా నీరు వెళ్తుంది. ఆ తర్వాత 9.5 కిలోమీటర్ల దూరం సొరంగమార్గంలో వస్తుంది. జాలగుట్ట దగ్గర  సొరంగ మార్గంలోనే పంపుహౌస్ ను ఏర్పాటు చేస్తున్నారు. సొరంగ మార్గం ద్వారా వచ్చిన నీటిని పంపుహౌస్ నుంచి 7 పంపుల ద్వారా 105 మీటర్ల ఎత్తుతో మేడారం చెరువులోకి నీటిని లిఫ్టింగ్ చేస్తారు.

మేడారం రిజర్వాయర్ నుంచి మధ్యమానేరు ప్రాజెక్టుతోపాటు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునర్జీవ పథకానికి నీటిని పంపిస్తారు. మేడారం రిజర్వాయర్ లో ఉన్న నీటిని 1.95 కిలోమీటర్ల దూరం గ్రావిటీ కెనాల్ ద్వారా నీటిని తరలిస్తారు. అక్కడి నుంచి 15.5 కిలోమీటర్ల సొరంగ మార్గం ద్వారా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామం వరకు చేరుస్తారు. అక్కడి నుంచి ఏడు పంపుల ద్వారా నీటిని 115 మీటర్ల ఎత్తుకు ఎత్తి గ్రావిటీ కెనాల్ లో పోస్తారు. ఇలా ఎత్తిపోసిన రెండు టీఎంసీల నీరు 5.7 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ద్వారా ప్రవహించి, గతంలోనే ఉన్న వరదకాలువ 99 కిలో మీటర్ దగ్గర కలుస్తుంది. ఇక్కడ క్రాస్ రెగ్యులరేటర్ ఏర్పాటు చేస్తారు. ఇక్కడి నుంచి ఒక టీఎంసీ నీటిని మధ్యమానేరు ప్రాజెక్టుకు, మరో టీఎంసీ నీటిని పునర్జీవ పథకం కింద శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎత్తి పోస్తారు. అందుకే మేడారం అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నది. గతంలో ఈ చెరువు కింద కేవలం 500 ఎకరాల ఆయకట్టు ఉండగా…ఇప్పుడు 10వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy