నంద్యాలలో టీడీపీ ఘన విజయం

Bhuma-Brahmananda-Reddyఏపీ స్టేట్ నంద్యాల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. భూమా బ్రహ్మానందరెడ్డి 27వేల 456 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. మొత్తం 19 రౌండ్లలో ఒకే ఒక్క రౌండ్ మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో వచ్చింది. మిగతా 18 రౌండ్లలో టీడీపీనే మెజార్టీ. అంచనాలకు మించి టీడీపీ భారీ మెజార్టీతో విజయం సాధించింది. వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి పట్టు ఉన్న గోస్పాడు మండలంలోనూ పోటీ ఇవ్వలేకపోయాడు. టీడీపీ – వైసీపీ హోరాహోరీగా సాగిన ప్రచారంలో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. జగన్ 12 రోజులు ప్రచారం చేసినా ఫలితం లేదు. చంద్రబాబు అభివృద్ధి మంత్రానికి నంద్యాల జనం మంత్రముగ్దులయ్యారు.

 

టీడీపీకి 97వేల 076 ఓట్లు రాగా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ కు 69వేల 610 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ కు 1382 ఓట్లు పడ్డాయి. టీడీపీ అభ్యర్థి 27వేల 466 ఓట్లతో విజయ సాధించాడు భూమా బ్రహ్మానందరెడ్డి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy