నంద్యాలలో టెన్షన్: భూమా, శిల్పా వర్గాల ఘర్షణ

1నంద్యాలలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నగరంలోని సూరజ్‌గ్రాండ్‌ హోటల్‌ దగ్గర భూమా, శిల్పా వర్గీయులు పరస్పరం దాడులకు దిగడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఘర్షణలు అదుపు చేయడానికి పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. రెండు వర్గాలకు చెందిన నేతలు పరస్పరం ఎదురుపడటంతో ఈ ఘటన చోటు చేసుకుంది.

గురువారం(ఆగస్టు 24) YCP మైనార్టీ నేత సలీం భాషా అంత్యక్రియల కార్యక్రమానికి హాజరైన YCP నేత శిల్పా చక్రపాణిరెడ్డి తిరిగి వస్తుండగా.. సూరజ్‌ గ్రౌండ్‌ హోటల్‌ దగ్గర భూమా వర్గానికి చెందిన టీడీపీ నేత అభిరుచి మధుతో పాటు మరికొంత మంది అనుచరులు ఎదురుపడ్డారు. దీంతో పరస్పరం వాగ్వాదానికి దిగారు. అది కాస్తా ముదరడంతో పరస్పర రాళ్ల దాడులకు దిగారు. ఇదే సమయంలో మధు గన్‌మెన్‌ గాల్లోకి కాల్పులు జరిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అలర్టై ఘటనా స్థలానికి చేరుకుని రెండు వర్గాలను చెదరగొట్టారు.

అభిరుచి మధుపై రౌడీషీట్‌ ఉంది. ఎన్నికల సమయంలో అభిరుచి మధుకు చంద్రబాబు సర్కార్‌ గన్‌మెన్‌లను కేటాయించడంపై అప్పట్లో విమర్శలు వచ్చాయి.

నంద్యాల ఉపఎన్నికల్లో TDP తరపున భూమా బ్రహ్మానందరెడ్డి… YCP తరపున శిల్పా మోహన్‌రెడ్డి పోటీ పడ్డారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy