నంద్యాలలో ప్రారంభమైన పోలింగ్

Nandyalaకర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ మొదలయింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ప్రతి పోలింగ్ బూత్ దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2 లక్షల మందికి పైగా ఓటర్లు.. అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నరు. మొత్తం 2 లక్షల 19 వేల మంది ఓటర్లకు గాను.. 2 లక్షల 3 వేల మందికి ఓటర్ స్లిప్పులు పంపిణీ చేశారు.  6 వేల మంది సిబ్బంది పోలింగ్ విధులు నిర్వర్తిస్తారు. మొత్తం 255 పోలింగ్ కేంద్రాలల్ల.. 144 కేంద్రాలను అత్యంత సమస్యాత్మకంగ.. 71 కేంద్రాలను సమస్యాత్మకంగ గుర్తించారు. కేంద్ర, రాష్ట్ర బలగాతో కలిపి 6 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాలు.. 82 ప్రత్యేక స్క్వాడ్ లతో పోలింగ్ ను పర్యవేక్షించనున్నరు. లిక్కర్ షాపులను మూసేయించారు.

ఇక రాత్రి నంద్యాల్ల శిల్పా మోహన్ రెడ్డి ఇంటి దగ్గరకి వచ్చిన పోలీసులు అక్కడ ఎవరూ ఉండొద్దంటూ హడావిడి చేశారు. దీంతోటి పోలింగ్ ఏజెంట్లను అడ్డుకోవడమేంటని పోలీసులను ప్రశ్నించారు శిల్పామోహన్ రెడ్డి. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నరని ఆరోపించారు. మరోవైపు శిల్పా మోహన్ రెడ్డి పోలింగ్ ఏజెంట్లను అడ్డుకోవద్దని హైకోర్టు తెలిపింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy