నంద్యాల ఉప ఎన్నిక నగారా

nandyala29న  ఉప ఎన్నిక  నోటిఫికేషన్‌ విడుదల

ఆగస్టు 23న పోలింగ్

నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు నగారా మోగింది. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతి చెందడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది.  ఎన్నికల కమిషన్‌  గురువారం నంద్యాల ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల చేసింది. వచ్చేనెల 23వ తేదీన ఉప ఎన్నిక నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది ఎన్నికల కమిషన్. ఈ నెల 29న  ఉప ఎన్నిక  నోటిఫికేషన్‌ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలకు చివరి తేదీ ఆగస్ట్‌ 5. నామినేషన్ల పరిశీలనకు గడువు వచ్చే నెల 7వ తేదీ. అలాగే నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు 9 తుది గడువు. ఇక ఆగస్టు 23న పోలింగ్‌, 28న ఓట్ల లెక్కింపు జరగనుంది.  ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదలతో తక్షణమే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. కాగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున శిల్పా మోహన్‌ రెడ్డి, టీడీపీ నుంచి  భూమా బ్రహ్మానందరెడ్డి బరిలో ఉన్నారు.

 

 

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy