నంద్యాల కౌంటింగ్ కు అంతా రెడీ

nandyalనంద్యాల బై పోల్ కౌంటింగ్‌కు సర్వ సిద్ధం చేశారు అధికారులు. నంద్యాల పాలిటెక్నిక్ కాలేజీలో సోమవారం (ఆగస్టు 28న) ఉప ఎన్నిక కౌంటింగ్ జరుగుతుందని చెప్పారు. కౌంటింగ్ సెంటర్ తో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్ బలగాలతో పాటు ఏపీఎస్పీ బెలాలియన్‌ను బందోబస్తుకు ఏర్పాటు చేసినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ గోపీనాథ్ తెలిపారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కౌంటింగ్ బందోబస్తుకు ఒక అడిషనల్ ఎస్పీ, ఐదుగురు డీఎస్పీలు, 17 మంది సీఐలు, 38 మంది ఎస్సైలు, 74 మంది ఎఎస్సై, హెడ్ కానిస్టేబుళ్ళు, 260 మంది కానిస్టేబుళ్ళు, 20 మంది మహిళా కానిస్టేబుళ్ళు, 44 సెక్షన్ల ఎఆర్ సిబ్బంది, 10 స్పెషల్ పార్టీలు, ఒక కంపెనీ సీఆర్పీఎఫ్‌ దళం, 5 ప్లటూన్ల ఏపీఎస్పీ బలగాలు ఏర్పాటు చేసి అన్నిరకాల ముందస్తు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల్లో 79.13 శాతం పోలింగ్ నమోదయింది. నియోజకవర్గంలో మొత్తం 2,18,858 ఓటర్లు ఉండగా 1,73,189 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 84,549 ఉండగా, మహిళలు 88,639 ఉన్నారు. సోమవారం (ఆగస్టు 28) ఉదయం 8 గంటలకు నంద్యాల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు (పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 250) జరుగుతుంది. తర్వాత EVM ఓట్ల లెక్కింపు ఉంటుంది. మొత్తం 19 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు వివరాల కోసం పోలింగ్ సెంటర్ ముందు LED స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 9.30 గంటల్లోగా ఎవరు ఆధిక్యంలో ఉన్నారో తెలిసిపోతుంది. ఉదయం 10.30 లోగా నంద్యాల విజేత ఫలితం వచ్చే అవకాశముంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy