నకిలీ విత్తనాలు అమ్మితే పిడి యాక్ట్: కేసీఆర్

cm-kcrపెట్టుబడి సమకూర్చడం నుంచి గిట్టుబాటు ధర కల్పించే వరకు వ్యవసాయానికి ప్రతీ అంశంలో రైతుకు ప్రభుత్వం వెన్నదన్నుగా ఉండాలన్నారు సీఎం కేసీఆర్. వ్యవసాయశాఖపై ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు సీఎం. నాణ్యమైన ఆహార పదార్థాలు, కూరగాయాలు, పండ్లు రైతులే పండించి అమ్మేవిధంగా తగిన సహకారం అందించాలని చెప్పారు. పండించిన పంటను ఆహార పదార్థంగా వినియోగించే ప్రాసెసింగ్ కూడా రైతులతో చేయించాలని అధికారులకు సూచించారు.
విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అన్నీ నాణ్యమైనవి మాత్రమే రైతులకు అందాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ నకిలీ, కల్తీకి అవకాశం లేకుండా చూడాలన్నారు. నకిలీ, కల్తీకి పాల్పడే వ్యక్తులపై పీడీ యాక్టు నమోదు చేసి జైలుకు పంపేవిధంగా కఠిన చట్టం రూపొందించాలన్నారు. ఆహార పదార్థారాలను కల్తీ చేసే వారిపై కూడా ఉక్కుపాదం మోపే విధంగా ఈ విధానం ఉండాలన్నారు. త్వరలోనే దీనిపై ఆర్డినెన్స్ తీసుకురానున్నట్లు తెలిపారు.

ఈ నెల 10వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు ఏఈవోలు గ్రామాల్లో పర్యటించాలని సీఎం ఆదేశించారు. ప్రతీ గ్రామంలో పర్యటించి వ్యవసాయ భూముల వివరాలు సేకరించాలన్నారు. ఏ రైతు దగ్గర ఎంత భూమి ఉంది, అందులో ఏ పంట సాగుచేస్తున్నారు, నీటి వసతి ఉందా… వానాకాలంలో ఏమి పండిస్తారు. యాసంగిలో ఏమి పండిస్తారనే పూర్తి వివరాలు తెలుసుకోవాలన్నారు.

సేకరించిన వివరాల ఆధారంగానే రైతుకు పెట్టుబడి అందించడంతో పాటు భవిష్యత్తులో రైతుకు సంబంధించిన ఇతర కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు సీఎం. రైతుల వివరాలు ఖచ్చితంగా ఉండాలి… వాస్తవాలే ఉండాలన్నారు. తప్పుడు వివరాలు సేకరించినా, తప్పుడు సమాచారం అందించినా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. వర్షాకాలంలో అవసరమైన ఎరువులను ముందుగానే సేకరించి నిల్వ ఉంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy