నగదు బదిలీ పథకంలో చేరిన కిరోసిన్ సబ్సిడీ

kiroseneగ్యాస్ రాయితీలో నగదు బదిలీ పథకం సక్సెస్ కావడంతో… కిరోసిన్ కు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చూస్తోంది కేంద్ర సర్కార్. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన జిల్లాల్లో ఏప్రిల్ 1 నుంచి నగదు బదిలీ అమలు చేయనుంది. కిరోసిన్ ను మార్కెట్ ధరకు కొన్న తర్వాత నగదు బదిలీ పథకం ద్వారా వినియోగదారుల ఖాతాలో రాయితీ మొత్తాన్ని జమ చేస్తారు. రేషన్ దుకాణాల్లో అమ్మే కిరోసిన్ ప్రస్తుతం సబ్సిడీపై 12 రూపాయలకు లభిస్తుంది. అయితే మార్కెట్ ధర 43 రూపాయలు ఉంది. అంటే లీటరు కిరోసిన్ కు కేంద్రం 31 రూపాయలు సబ్సిడీ ఇస్తోంది. ఈ మొత్తాన్ని నగదు బదిలీ పథకం ద్వారా చెల్లించాలని డిసైడ్ అయింది కేంద్రం. కిరోసిన్ కు నగదు బదిలీ పథకం అమలు చేసేటప్పుడు ప్రారంభంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా.. కొంతకాలం అర్హులైన వారికి ముందుగానే రాయితీని బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారు. ఛత్తీస్ గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలు కిరోసిన్ నగదు బదిలీకి ఓకే చెప్పాయి. ఈ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన జిల్లాల్లో కిరోసిన్ కు నగదు బదిలీ ద్వారా రాయితీ అందించనున్నారు. కిరోసిన్ రాయితీ నగదు బదిలీకి ఆసక్తి చూపని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాయితీ పొదుపులో మొదటి రెండేళ్లలో 75శాతం, మూడో సంవత్సరం 50శాతం, నాలుగో సంవత్సరం 25శాతం చెల్లిస్తారు. కిరోసిన్ కేటాయింపులో  కోతకు రాష్ట్రాలు స్వచ్ఛందంగా అంగీకరిస్తే.. నగదు బదిలీ ద్వారా మిగిలే మొత్తంతో పాటు మరిన్ని ప్రోత్సాహకాలనూ అదనంగా చెల్లిస్తారు.

జాతీయ ఎల్పీజీ వినియోగదారుల సంవత్సరంగా 2016

కేంద్రప్రభుత్వం ఈ ఏడాదిని ఎల్పీజీ వినియోగదారుల సంవత్సరంగా ప్రకటించింది. 2018 వరకు అందరికీ గ్యాస్ అందేలా చూడాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy