నగర జనాభాలో ‘ఢిల్లీ’కి రెండో స్థానం..

జనాభా లెక్కల్లో ఢిల్లీకి రెండో స్థానం వచ్చింది. ఇదేదో 2011 సెన్సెక్స్ గురించి కాదు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న నగరాల్లో  ఢిల్లీకి సెకండ్ ప్లేస్ దక్కింది. ఫస్ట్ ప్లేస్ లో ఉన్న టోక్యో తర్వాతి స్థానంలో నిలిచింది మన దేశ రాజధాని. వరల్డ్ అర్బనైజేషన్ గురించి జరిగిన సమావేశంలో 2050 కల్లా ఇండియా అర్బన్ పాపులేషన్ విషయంలో ఇండియా ఫస్ట్ ప్లేస్ కు చేరుకుంటుందన్నారు.

images (2)దేశ రాజధాని ఢిల్లీ 2030 కల్లా  3.6 కోట్ల మంది జనాభాను కల్గి ఉంటుందని అంచనా వేశారు. ఈ ఏడాది వచ్చిన ర్యాంకింగ్స్ లో టోక్యో 3.8 కోట్ల మంది జనాభాతో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది.  ఆర్ధిక రాజధాని ముంబాయి ఈ ర్యాంకింగ్స్ లో ఆరో స్థానంలో నిలిచింది. 2030 కల్లా ఇది నాల్గొ స్థానానికి వస్తోందని అంచనా వేశారు. 2030 కల్లా ముంబాయి జనాభా 2.8 కోట్లకు చేరుతోందని సర్వేలో తేలింది.

టోక్యో, న్యూఢిల్లీ నగరాల్లో ఆర్బన్ గ్రోత్ చాలా ఉంటోందని..సర్వేలో తేలింది. ఈ రెండు నగరాలతో పాటు నైజీరియాలో కూడా 37 శాతం అర్బన్ జనాభా ఉంటారని తేలింది.  2050 కల్లా ఇండియా జనాభాలో 40 కోట్ల మంది కొత్తగా ఆర్బన్ ఏరియాలకు వలస వస్తారని తేలింది. చైనాలో 29 కోట్ల మంది  ప్రజలు కొత్తగా పట్టణ ప్రాంతాల్లోకి వస్తారని తేలింది. ప్రస్తుతం ఇండియాలో 41 కోట్ల మంది ఉన్న పట్టణ జనాభా 2050 కల్లా 81 కోట్లకు చేరుతోందని అంచనా వేశారు. 2050 కల్లా చైనాలో 75 కోట్ల మంది పట్టణ ప్రాంతాల్లో నివశిస్తారని తేల్చారు. ప్రస్తుతం 54 శాతం ఉన్న పట్టణ ప్రజలు 2050 కల్లా 66 శాతానికి పెరుగుతారని సర్వేలో తేలింది.

images (3)ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా  390 కోట్లు ఉన్న పట్టణ జనాభా…2050 కల్లా 630 కోట్లకు చేరుకోనుంది. రూరల్ ప్రాంతాల్లో నివసించే వారి సంఖ్య గత కొన్నేళ్లుగా తగ్గుతోందని…ప్రస్తుతం  340 కోట్ల మంది మాత్రమే రూరల్ ఏరియాల్లో ఉంటున్నారని…2050 కల్లా 300 కోట్లకు పడిపోతుందని తేల్చారు. ప్రస్తుతం రూరల్ పాపులేషన్ లో ఇండియా టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఇండియాలో  85.7 కోట్ల మంది రూరల్ ప్రాంతంలో ఉంటే…చైనాలో 63.5 కోట్ల మంది రూరల్ ఏరియాల్లో ఉంటున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy