నటసింహం విశ్వరూపం : బాలయ్య కొడితే ఇలా ఉంటది

balakrishnaనట సింహం విశ్వరూపం స్క్రీన్ పైనే కాదు.. బయట కూడా కనిపించింది. ఇప్పటి వరకు వాళ్లూ వీళ్లూ చెబితే వినటమేగానీ.. ఇప్పుడు మాత్రం అందరికీ చూపించేశారు నందమూరి బాలకృష్ణ. 102వ మూవీకి కొబ్బరికాయ కొట్టే కార్యక్రమం హైదరాబాద్ లోని ఫిల్మ్ సిటీలో జరిగింది. దేవుడికి పూజ చేయటానికి రెడీ అయ్యారు హీరో. ఇక్కడే అందరికీ దొరికిపోయారు.

గురువారం (ఆగస్ట్ 3) కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ఈ టైంలో అసిస్టెంట్ పై చేయి చేసుకున్నారు. కాళ్లకు ఉన్న షూ తీయలేదని నెత్తిన ఒక్కటి పీకారు. ఆ టైంలో హీరోలోని ఆవేశం, అసహనం స్పష్టంగా కనిపించాయి. పూజకు వెళుతూ నిల్చొన్న బాలయ్య.. కాళ్లకు ఉన్న షూను తీయలేదని అసిస్టెంట్ పై చేయి చేసుకున్నారు. ఈ వీడియో బయటకు రావటంతో.. నిమిషాల్లోనే వైరల్ అయ్యింది. హీరో అయితే కొడతాడా.. అసిస్టెంట్లను బాలయ్య ఇలా కొడతారా అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. అసిస్టెంట్ పై చేయి చేసుకున్న బాలయ్య విజువల్స్ ఇప్పుడు వైరల్ అయ్యింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy