నటుడిగా భారతీ నన్ను అంగీకరించలేదు: రజనీ

RAJANIప్రేక్షకులే కాదు… స్టార్‌ హీరోలు కూడా ఆరాధించే సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌. అయితే కెరీర్‌ మొదట్లో రజనీ విలన్‌ పాత్రలు కూడా చేశారు. అయితే దర్శకుడు భారతీరాజా ఏనాడూ రజనీని ఓ నటుడిగా అంగీకరించలేదట. ఈ విషయాన్ని స్వయంగా రజనీనే వెల్లడించారు. చెన్నైలో భారతీరాజా ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు రజనీకాంత్, కమల్ హాసన్. ఈ సందర్భంగా మాట్లాడిన రజనీ …నటుడిగా నన్ను ప్రజలు ఎలా అంగీకరిస్తున్నారని భారతీరాజా మనసులో అనుకుంటుంటారన్నారు. గతంలో కొంతమంది విలేకరులు రజనీ గురించి మీ అభిప్రాయం ఏంటని భారతీరాజాను అడగ్గా… ‘మంచి వ్యక్తి’ అని చెప్పారన్నారు. అంతే కానీ.. ‘అతను మంచి నటుడు’ అని ఆయన ఎప్పటికీ అంగీకరించరన్నారు రజనీ.

‘కళ్లుక్కుల్‌ ఈరమ్‌’లో నటించిన నన్నే ప్రేక్షకులు నటుడిగా గుర్తించలేదు.. నిన్నెలా అంగీకరించారు’ అన్నట్లుగా ఆయన నన్ను చూస్తుంటారు. భారతీరాజా అంటే నాకూ..నేనంటే ఆయనకూ ఎంతో ఇష్టం. నటులు కెమేరాకి నచ్చితే ప్రేక్షకులకూ నచ్చుతారు. అభిమానులకు ఏ హీరో నచ్చుతాడో ఎవరూ చెప్పలేం. నేను ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో నేర్చుకున్నదానికంటే దర్శకుడు కె. బాలచందర్‌ దగ్గరే ఎక్కువ  నేర్చుకున్నా అని తెలిపారు రజనీ.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy