నటుడు విక్రమ్ కుమారుడి ర్యాష్ డ్రైవ్..ఒకరికి గాయాలు

తమిళ నటుడు ధృవ్ పై ర్యాష్ డ్రైవింగ్ కేస్ బుక్ అయింది. ధృవ్ తో పాటు అతని స్నేహితుడిపైనా కేస్ పెట్టారు పోలీసులు. చెన్నైలో నిన్న(ఆదివారం,ఆగస్టు-12) తెల్లవారుజామున … ధృవ్ కారు అదుపుతప్పి ఆటోను డీకొట్టింది. దీంతో ఇద్దరు గాయపడ్డారు. ఆటోలోనే నిద్రపోతున్న డ్రైవర్ కు తీవ్ర గాయాలు కాగా… హాస్పిటల్ లో చేర్పించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. తెలుగువారికి బాగా పరిచయమున్న నటుడు విక్రమ్ కొడుకే ఈ ధృవ్. తెలుగు సూపర్ హిట్ అర్జున్ రెడ్డి సినిమా తమిళ రీమేక్ లో ధృవ్ నటిస్తున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తుచేపట్టారు. ​కారు బ్రేకులు ఫెయిల్ కావడం కారణంగానే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy