నడిరోడ్డుపై గజరాజు ఆకలి కేకలు

elephant-2ఆకలి కేకలు.. ఈ ఫొటోను చూస్తే సరిగ్గా అదే అర్థం వస్తుంది. మనిషైనా.. జంతువైనా.. కడుపుతిప్పలకు ఏదైనా చేస్తారనడంలో సందేహం లేదు. పాపం.. ఈ ఏనుగు పరిస్థితి అదే. అడవిలో ఏమీ దొరక్క రోడ్డుమీదకొచ్చింది ఈ ఏనుగు. దారిలో కనపడ్డ ఈ లారీని ఆపి.. దానిలోని ఆలుగడ్డలను ఆబగా తినేసింది. ఈ ఘటన ఆదివారం పశ్చిమబెంగాల్‌లోని మిడ్నాపూర్ లో జరిగింది. 60వ నంబరు జాతీయ రహదారిపై ఆలుగడ్డల లారీని అడ్డగించిని గజరాజు..  దానిలోని ఆలుగడ్డలను  ఆరగించే వరకు కదల్లేదు.  దీంతో ఆ రోడ్డులో సుమారు గంటసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అటవీ అధికారులు గ్యాస్‌ తుటాలతో కాల్పులు జరిపి ఏనుగును అతికష్టం మీద అడవిలోకి పంపించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy