నడిరోడ్డుపై పూడ్చేశారు

bangalore pothole deathగతుకుల రోడ్లు ప్రాణాలు తీసేస్తున్నాయి. ప్రాంతమేదైనా నడిరోడ్డు మనుషుల్ని మింగేస్తోంది. గతవారం బెంగుళూరు గతుకుల రోడ్లకు టెకీ స్తుతీ పాండే త్రిపాఠి బలవ్వగా.. తాజాగా మధ్యప్రదేశ్ కి చెందిన లటోరీ బర్మాన్ చనిపోయాడు. ఇవి రెండూ వేరు వేరు ఇన్సిడెంట్లు అయినా.. ప్రాణాలు తీసింది మాత్రం గతుకుల రోడ్డే.  గత గురువారం ఉదయం 9 గంటలకు భర్తతో పాటు జాబ్ కు వెళుతుండగా బైక్ పైనుంచి పడిపోయింది స్తుతి. రోడ్డు గతుకులమయం అవ్వడమే దీనికి కారణం.  హాస్పిటల్ కు తీసుకువెళ్లినా లాభం లేకుండా పోయింది. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయిందని తెలిపారు డాక్టర్లు. ఈ వార్త ఇప్పుడు బెంగుళూరులో హాట్ టాపిక్ గా మారింది. బెంగుళూరు మున్సిపల్ కార్పొరేషన్ రోడ్ల నిర్వహణ సరిగ్గా లేదనే విమర్శలు ఇప్పటికే మూటగట్టుకుంది. తాజా ఘటనపై బెంగుళూరు వాసులు మరింత ఫైర్ అవుతున్నారు.

drunkenmegligence_8am1మరోవైపు మధ్యప్రదేశ్ లో బతికున్న వ్యక్తిని నడిరోడ్డుపై పూడ్చిపెట్టేశారు రోడ్డు వర్క్స్ చేసే కార్మికులు. కాట్ని జిల్లాలోని ఉడ్లానా – హతా రోడ్డులో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఖాద్రా గ్రామానికి చెందిన లటోరి బర్మాన్ అనే వ్యక్తి మరణించాడంటున్నారు పోలీసులు. బర్మాన్ తన భార్యతో కలిసి రుషి పంచమి వేడుకలకు అత్తగారింటికి వెళ్లాడు. పండుగ జరిగిన తరువాత భార్యను పుట్టింటిలోనే వదిలేసి సొంత గ్రామానికి బయలు దేరాడు. వెళుతూ దార్లో మందు కొట్టాడు. అక్కడి నుంచి ఇంటికి వెళుతుండగా…  నడిరోడుపై ఉన్న గుంతలో పడిపోయాడు. మద్యం మత్తులో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. తరువాతి రోజు ఉదయం రోడ్డు పనులు చేస్తున్న వారు ఆ గుంతలో పడిన బర్మాన్ ను చూడకుండా కంకర, మట్టి వేసి పూడ్చేశారు. కంకర, మట్టి వేస్తున్న సమయంలో మెలుకవొచ్చిన బర్మాన్ బయటకు రావడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అయితే చెయ్యి మాత్రం బయటకు వచ్చింది. కానీ ఫలితం లేకుండా పోయింది. సోమవారం ఉదయం రోడ్డు మీద చేతిని గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో అసలు విషయం వెలుగు చూసింది. బర్మాన్ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ బర్మాన్ కుంటుంబానికి 50 వేలు నష్టపరిహారం ప్రకటించారు. కార్మికులు నిర్లక్ష్యంగా పనులు చెయ్యడం వల్లే ఇలా జరిగిందని బర్మాన్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రోడ్డు పనులు చూస్తున్న కాంట్రాక్టరును అరెస్టు చేసి విచారిస్తున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy