నడిరోడ్డు పై గ‌జ‌రాజు ఫుట్‌బాల్

footbaఫుట్‌బాల్ గేమ్ ఈ మ‌ధ్య‌కాలంలోనే భార‌త్‌లో పాపుల‌ర్ అవుతోంది. దీన్ని కేవ‌లం పిల్ల‌లు యువ‌కులు మాత్ర‌మే ఆడ‌టం లేదు…జంతువులు కూడా ఆడుతున్నాయి. తాజాగా అస్సోం మెయిన్ రోడ్డుపై ఓ గున్న ఏనుగు ఫుట్‌బాల్ ఆడుతూ క‌నిపించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 53 సెక‌న్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ఆ ఏనుగు ఎంతో హ్యాపీగా ఫుట్‌బాల్ ఆడుతూ క‌నిపించింది. అయితే అక్క‌డ నిజంగా ఫుట్‌బాల్ లేదు. దాని స్థానంలో ఓ ప్లాస్టిక్ డబ్బా ఉంది. ఈ గ‌జ‌రాజు ఆడుతుండ‌గా దాదాపు అర‌గంట పాటు ట్రాఫిక్ ఎక్క‌డిక‌క్క‌డే నిలిచిపోయింది. అత్య‌వ‌స‌ర ప‌నిమీద వెళ్లాల్సిన కొంద‌రు భారీగా ట్రాఫిక్ నిలిచిపోవ‌డంతో వేరే దారులు వెతుక్కోవాల్సి వ‌చ్చింది. మ‌రికొంద‌రైతే వాహ‌నాల్లోనే ఉండి ఈ ఏనుగు పిల్ల ఆడే ఆట‌ను చూసి తెగ ఎంజాయ్ చేశారు. సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్ది గంట‌ల్లోనే వైర‌ల్ అయ్యింది వీడియో.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy