నడుస్తోంది… హర్రర్ ట్రెండ్

Nayanatara-mayuri-movie-review-e1442492395898కాసులు కురవాలంటే కాన్సెప్ట్ ఉండాల్సిందే. నటించే వాళ్లకు పేరు లేకున్నా.. ప్రమోషన్లతో సినిమాకు హైప్ తీసుకొచ్చే కెపాసిటీ లేకున్నా.. సక్సెస్ కొట్టాలంటే ఆ కాన్సెప్ట్ కావాల్సిందే. ఇండస్ట్రీలోకి కొత్తగా అడుగు పెట్టేవాళ్లు.. టాలీవుడ్ లో కాస్త జాగ కోసం ఆరాటపడుతున్న న్యూ డైరెక్టర్లంతా… సెలెక్ట్ చేసుకునేది కూడా ఆ కాన్సెప్టే. ఒక్క టాలీవుడ్ లోనే కాదు. ఏ మూవీ ఇండస్ట్రీలో చూసినా ఇడే ట్రెండ్. మరి.. ఆ సంగతేంది? అందులో స్పెషల్ ఏంది?

చిమ్మ చీకట్లు.. తెల్లని ఆకారం.. గజ్జెల చప్పుడు.. దూరంగా నక్కల అరుపులు., చూసినా, విషయం ముందే తెలిసినా.. అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఆడియెన్స్ కు భయం కలిగించే జోనర్.. హార్రర్ మూవీ. అందుకే… కాస్త కొత్తగా చూపిస్తే చాలు. పెట్టిన ఇన్వెస్ట్ మెంట్ గ్యారెంటీ. కాన్సెప్ట్ వెరైటీగా ఉండి.. ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తే చాలు. లాభాలు డబుల్ గ్యారెంటీ. ఇదే రీజన్ తో… హార్రర్ సినిమాల వెంట పడుతోంది.. టాలీవుడ్ న్యూ టాలెంట్.

మయూరి. అశ్విన్ శరవణన్ డైరెక్షన్ లో.. నయనతార లాంటి టాప్ హీరోయిన్ లీడ్ రోల్ లో వచ్చిన ఈ మూవీ.. స్టార్టింగ్ టు ఎండింగ్.. ఆడియెన్స్ ను సస్పెన్స్ లో ముంచేసింది. ఈ సినిమా చూసి భయపడకుండా ఉంటే.. 5 లక్షల రూపాయలిస్తామంటూ… నిర్మాత ఓపెన్ ఆఫర్ ఇవ్వడంలో… మూవీలో హారర్ కంటెంట్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ముందు నయనతార ఇమేజ్ తో హైప్ తెచ్చుకున్నా… తర్వాత మూవీలో విషయం కూడా ఉండడంతో మయూరి సినిమా.. హారర్ జోనర్ లో మాంచి సక్సెస్ కొట్టింది.

హారర్ సినిమాల సక్సెస్ పై… హీరోల కంటే హీరోయిన్లే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంతకు ముందు వచ్చిన సినిమాలతో పాటు.. మయూరి, కాంచన కూడా వర్కవుట్ కావడంతో… త్రిష, స్వాతి లాంటి హీరోయిన్లు కూడా హారర్ సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం స్వాతి యాక్ట్ చేస్తున్న త్రిపుర సినిమా … రిలీజ్ కు రెడీ అయ్యింది. గీతాంజలితో హారర్ హిట్ కొట్టిన రాజ్ కిరణ్ దర్శకత్వంలో రూపొందుతున్న త్రిపుర కోసం తెలుగు, తమిళ ఇండస్ట్రీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. మూడు పదుల వయసులో హాఫ్ సెంచరీ కొట్టిన త్రిష.. నాయకి అవతారం ఎత్తింది. హీరోయిన్ ఓరియంటెడ్ రోల్ లో టాలీవుడ్ ను, కోలీవుడ్ ను భయపెట్టడానికి వస్తోంది. త్రిష కెరీర్ లోనే బెస్ట్ మూవీ అవుతుందంటూ ఇండస్ట్రీలో మూవీపై క్రేజ్ పెంచుతోంది నాయకి చిత్ర యూనిట్. టీవీల్లో యాడ్ తోనే జనాన్ని జడుసుకునేలా చేసిన సినిమా… చంద్రిక. చంద్రికా… అంటూ హీరోయిన్ తల బాదుకుంటూ ఉండే ఆ ట్రైలర్ చూడగానే.. భయంతో చానల్ మార్చేసిన వాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. కాస్ట్ అండ్ క్రూ తో సంబంధం లేకుండా… పబ్లిసిటీతో జనాన్ని థియేటర్లకు రప్పగించలమని ప్రూవ్ చేసిన సినిమా ఇది.

మయూరి, చంద్రిక కంటే… చాలా సినిమాలు టాలీవుడ్ జనాన్ని భయపెట్టిన లిస్ట్ లో ఉన్నాయి. మంత్ర లాంటి సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ గా వచ్చింది మంత్ర 2… ఈ లిస్ట్ లో ఒకటి. చార్మింగ్ హీరోయిన్ చార్మి లీడ్ రోల్ లో రిలీజ్ అయిన ఈ సినిమా.. కాన్సెప్ట్ పాతదే అయినా.. టేకింగ్ కొత్తగా ఉండడంతో జనాన్ని అట్రాక్ట్ చేసింది. లాభాల సంగతి పక్కన పెడితే… హారర్ కాన్సెప్ట్ తో ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. డ్యాన్సింగ్ స్టార్ లారెన్స్… డైరెక్టర్ గా మారిన తర్వాత హారర్ మూవీలతో టాలెంట్ చూపించేందుకు తెగ ట్రై చేశాడు. ముని, కాంచన సినిమాల తర్వాత… లారెన్స్ డైరెక్షన్ లో వచ్చిన మూవీ.. గంగ. కాంచనకు సీక్వెల్ గా రిలీజ్ అయిన ఈ సినిమా కూడా… లారెన్స్ మార్క్ ఆఫ్ టేకింగ్ తో… జనాన్ని బాగానే భయపెట్టింది. నిర్మాత గల్లాపెట్టె నింపేసింది.

టాలీవుడ్ లో భయపెట్టే సినిమాలకు ఈ మధ్య కేరాఫ్ అయిన రవిబాబు.. ఈ ఏడాది అవును 2 తో జనం ముందుకొచ్చారు. అవును సినిమా లాస్ట్ షాట్ దగ్గరి నుంచి మొదలైన ఈ సినిమా కూడా.. సస్పెన్స్ థ్రిల్లింగ్ స్క్రేన్ ప్లే తో థియేటర్లో కొచ్చింది. మొదటి సినిమా ఇచ్చినంత కిక్ ఇవ్వకపోయినా… అవును2తో రవిబాబు కమర్షియల్ గా సక్సెసయ్యాడు.

హారర్ కంటెంట్ తో సక్సెస్ పొందొచ్చని నమ్ముతున్న చిన్న నిర్మాతలు కూడా… ఇదే రూట్ ఫాలో అవుతున్నారు. ఈ ఏడాది మొదట్లో  వచ్చిన కాలింగ్ బెల్ సినిమా ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. మనిషి రూపంలో ఉన్న ఆత్మ.. ప్రతీకారం కోసం చేసే ప్రయత్నమే ఈ సినిమా కాన్సెప్ట్. ఈ సినిమాలే కాదు. అంతకు ముందు రిలీజైన గీతాంజలి, కార్తికేయ లాంటి హారర్, థ్రిల్లర్ మూవీస్ కూడా సక్సెస్ అయ్యాయి. లో బడ్జెట్ లో రూపొంది… నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టాయి. ఈ సక్సెస్ లు ఇస్తున్న ఎంకరేజ్ మెంట్ తో… ముందు ముందు మరిన్ని భయపెట్టే సినిమాలకు ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy