
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ కి చెందిన సందీప్ తొట్టపిల్లై(42) తన భార్య సౌమ్య(38), కుమారుడు సిద్దాంత్ (12), సాచీ (9)తో కలిసి బంధువుల ఇంటికి వెళ్లేందుకు ఒరెగాన్ నుంచి కాలిఫోర్నియాకు కారులో బయలుదేరారు. అయితే మార్గమధ్యలో వీరు కన్సించకుండా పోయారు. దీంతో అప్పటినుంచి సహాయక బృందాలు వీరి కోసం గాలిస్తున్నాయి. ఈ సమయంలో ఈ రోజు ఈల్ నదిలో ఓ చోట పెట్రోల్ వాసన వస్తున్నట్లు గుర్తించిన రెస్య్కూ టీం ఆ ఏరియాలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సమయంలో నీటిలో మునిగిపోయి ఉన్న కారులో సందీప్, సాచి, సౌమ్యల మృతదేహాలను గుర్తించామని, అయితే సిద్ధాంత్(12) ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందని, పోలీసులు తెలిపారు.