నన్ను నా పేరుతో గుర్తిస్తేనే ఇష్టం

VENKAIAH-NAIDUతనను తన పేరుతోనే గుర్తిస్తేనే ఇష్టమని అన్నారు ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి ముప్పవరపు వెంకయ్య నాయుడు. హైదరాబాద్ లో జరిగిన ఆత్మీయ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఒక వాజ్ పేయి, అద్వానీ, ఎన్జీరంగా, పుచ్చలపల్లి సుందరయ్యల్లా తనను గుర్తుపెట్టుకోవడంలోనే ఆనందముంటుందన్నారు. ఉపరాష్ట పదవి పేరుతో పిలిచే కన్నా.. పేరుతోనే సంతృప్తి ఉందన్నారు. పద్దతిగా నడవాలంటే చాలా కష్టమని.. నిజాయితీగా ఉండాలన్నా చాలా కష్టమన్నారు. చట్టప్రకారం నడుచుకోవాలనేది ప్రధాని మోడీ కోరికని… దానిలో భాగంగానే ఆయన కృషిచేస్తున్నారన్నారు. స్వర్ణభారత్ ట్రస్ట్ ఎలాంటి నిధులు తీసుకోలేదని.. అయినా అనవసర ఆరోపణలు చేశారన్నారు. దేశంలో ఐదువేల తొమ్మిదివేల సంస్థలకు నోటీసులు పంపించారన్నారు. దానిలో భాగంగానే స్వర్ణభారత్ ట్రస్ట్ కు నోటీసులు వచ్చాయన్నారు. తనను ఆరోపణలు బాధించాయన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేయడంలోనే సంతోషం ఉందన్నారు.

ప్రాంతాలు వేరైనా.. మనమంతా తెలుగువారిమే

క్రమశిక్షణ, సమయపాలన, పద్ధతులు పాటించడం… హడావుడి చేయకపోవడం… ఇవే జీవితంలో పాటించానన్నారు. తెలుగు ప్రజలందరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నానని… పరిపాలనా సౌలభ్యం కోసమే రెండుగా విడిపోయామన్నారు. మనమంతా తెలుగువారిమే.. మనమంతా భారతీయులమేనని గుర్తు చేశారు. చంద్రబాబు, కేసీఆర్ లకు దయచేసి కలిసి పనిచేయాలని కోరానని… ఘర్షణపూరిత వాతావరణం వద్దని తెలిపానన్నారు. ఢిల్లీలోని ఆంధ్రా భవన్ ను రెండుగా వేరుచేసుకోమని సూచించానన్నారు. పార్టీలు వేరైనా… కలిసి కట్టుగా వెళ్లాలని చెప్పానన్నారు… నీటి సమస్యలతో పాటు అన్నింటిని పరిష్కరించుకోవాలని సూచించానన్నారు వెంకయ్య.

ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, నాయిని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, లోక్ సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ, ఏపీ మంత్రులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy