నమస్కారం.. వార్తలు చదువుతోంది: దూరదర్శన్ వార్తలకు 34 ఏళ్లు

shanthi-swaroopఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లో ఇంటర్నెట్ ఉన్న సెల్ ఫోన్… అందరికీ అందుబాటులో సోషల్ మీడియా.. అన్ని భాషల్లో 24 గంటల న్యూస్ ఛానళ్లతో ఎప్పటికప్పుడు అప్ డేట్స్ తెలుసుకోవచ్చు. మరి, మూడు దశాబ్దాల క్రితం పరిస్థితేంటి..? తొలి తెలుగు వార్తలు ఎలా ప్రసారమయ్యాయి. ఫస్ట్ వార్తలు ఎవరు, ఎప్పుడు చదివారు.. ఈ విషయాలన్నిటి గురించి తెలిపే ప్రత్యేక కథనం

 నమస్కారం..

ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు..

బాలల దినోత్సవం సందర్భంగా  లాల్ బహదూర్ స్టేడియంలో బాలల దినోత్సవాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు ప్రారంభించారు…

తెలుగు టీవీ చరిత్రలో తొలిసారి ప్రసారమైన వార్తల్లోని ముఖ్యాంశాలు ఇవి. దూరదర్శన్ చానల్ లో సాయంత్రం 7 గంటలకు ప్రసారమైన ఈ వార్తలు అప్పట్లో ఒక సంచలనం. వాటిని లైవ్ లో చదివి వినిపించింది, ఇప్పుడు చాలా మంది న్యూస్ రీడర్లు గురువుగా భావించే శాంతి స్వరూప్. 34 ఏళ్ల క్రితం నవంబర్ 14వ తేదీన ఈ వార్త బులిటెన్ ప్రారంభం అయ్యింది. మొదటి వార్త బులిటెన్ చదవిన శాంతిస్వరూప్ v6newsతో నాటి అనుభవాలను గుర్తు చేసుకున్నారాయన.

అప్పుడు ఉన్నది దూరదర్శన్ ఒక్కటే. అందుకే.. ఊరి మొత్తంలో టీవీ ఉన్న ఒకరిద్దరి ఇంటికే అందరూ వెళ్లేవారు. సాయంత్రం 7 గంటలైతే వార్తలు తెలుసుకునేందుకు టీవీలకు అతుక్కుపోయేవారు. ఆ సమయంలో వచ్చే మ్యూజిక్ వింటే చాలు, ఎక్కడున్నా పరిగెత్తుకుని వచ్చే వాళ్లు.

మూడు దశాబ్దాల క్రితం కనీసం టెలీ ప్రాంప్టర్ కూడా లేదు. దీంతో స్క్రిప్ట్ పేపర్లనే బట్టీ పట్టి వార్తలు చెప్పారు శాంతి స్వరూప్. వార్తలు ప్రారంభమైన పదేళ్ల పాటు అదే పరిస్థితి. టెలీ ప్రాంప్టర్ లేదు.. తప్పులు జరగకుండా చాలా బట్టీ పట్టి వార్తలు చదివే వాడిని.. మిగిలిన వారు అందరూ భయపడ్డారు ఎక్కడ తప్పులు చదువుతానోనని” అంటూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తొలి తెలుగు వార్తలు ప్రసారమై 34 ఏళ్లయిన సందర్భంగా అప్పట్లో అవకాశం ఇచ్చిన దూరదర్శన్ కు, ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు శాంతి స్వరూప్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy