నమో ప్రభుత్వానికి స్వాగతం పలుకుతున్న సమస్యలు

modi-cabinet-AFP-650ప్రభుత్వం ఏర్పాటుచేయడం ఒక ఎత్తు. ప్రజా రంజకంగా పాలించడం మరో ఎత్తు. సమస్యల పరిష్కారంపైనే మోడీ ప్రతిష్ట ఆధారపడి ఉంది. పదేళ్ల కాంగ్రెస్ పాలనకు పుల్ స్టాప్ పెట్టిన ప్రజలు …నమో గవర్నమెంట్ పై ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు. సంకీర్ణాలను వదిలి బీజేపీ కి ఇచ్చిన మెజార్టీ సీట్లే దీనికి నిదర్శనం. నరేంద్రమోడీ గవర్నమెంట్ కు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ప్రభుత్వంలోని ఏడు మంత్రిత్వ శాఖలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ప్రజలంతా ఆ శాఖలపై ఆశలు పెట్టుకున్నారు. వీటిని సమర్ధంగా పరిష్కరించడంతో కొత్త ప్రభుత్వం పనితనం ఆధారపడి ఉంటుంది. ఇందులో ముఖ్యమైనవి రక్షణ. హోం, ఆర్థిక శాఖలున్నాయి. ఇవి వేటికవే ప్రజా జీవితాలతో ముడిపడి ఉన్నాయి. ఆర్థిక సంక్షోభం కేంద్ర ప్రభుత్వానికి ప్రధమ పరీక్ష. దేశం చూపంతా దీనిపైనే ఉంది. ఇప్పటికే నమో సర్కర్ అధికారంలోకి వస్తుందన్న ప్రచారంతో స్టాక్ మార్కెట్లు దూసుకుపోవాల్సి ఉంది. కాని ఆశించినంతగా లేదు.
రెండోది రక్షణ రంగం. ఇది దేశ స్వావలంభన, సమగ్రతపై ఆధారపడిన అంశం. చాలా దేశాలతో సరిహద్దు సమస్య ఉంది. సివిల్ , మిలటరీ అదికారుల మధ్య సమన్వయం లోపించింది. విభేదాలు నానాటికి తీవ్రమవుతున్నాయి. ఆధునాతన ఆయుధాల కొరత సైన్యాన్ని వెంటాడుతోంది.
రైల్వే శాఖ. ఇది దేశంలో ప్రధానమైనది. ఆ శాఖ ఆర్థిక పరిస్థితి అంత గొప్పగా లేదు. వాటి భద్రత గాలిలో దీపం అయింది. మోడీ ప్రమాణ స్వీకారం రోజే భారీ ప్రమాదం చోటుచేసుకోవడం ప్రభుత్వానికి మింగుడుపడని అంశమే.
విదేశాంగ శాఖ కూడా పుట్టెడు కష్టాల్లో ఉంది. సరిహద్దు దేశాలతో మనదేశానికి సరైన స్నేహ పూర్వక సంబంధాలు లేవు. కాశ్మీర్ ఇంకా భగ్గుమంటునే ఉంటుంది,. వాజ్ పాయి హయాంలో నిర్వహించిన లాహోర్ బస్సు యాత్రతో పెరిగిన పాక్ సంబంధాలను బీజేపీ ప్రభుత్వం కొనసాగించాలని భావిస్తోంది.
ఇక అంతర్గత భద్రత కేంద్రానికి ముచ్చెమటలు పుట్టిస్తోంది. వామపక్ష తీవ్రవాదం వివిధ రాష్ట్రాలో అట్టుడుకిపోతోంది. మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మహిళలపై అత్యచార ఘటనలు నానాటికి పెరిగిపోయి ఆందోళన కలిగిస్తున్నాయి. ఢిల్లీలో జరిగిన నిర్బయ ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఇక వ్యవసాయ శాఖ కూడా కీలకమే. దేశాభివద్దిలో ఈ శాఖకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎలినినో ప్రభావంతో వర్షపాతం నానాటికి అస్తవ్యస్థం కావడం ఆందోళన కలిగించే అంశం. ప్రభుత్వాల ప్రతిష్ఠ ఉల్లి గడ్డలు , కూరగాయాల ధరల మీద ఆధార పడి ఉంటుంది. ధరల నియంత్రణ కూడా ప్రభుత్వానికి పెను సవాల్ గా మారింది.
మోడీ సర్కార్ వీటన్నింటిపై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. సమస్యలన్నింటిని అధిగమించి పరిష్కారం చూపెట్టాల్సిన బాధ్యత నమో ప్రభుత్వంపై ఎంతైనా ఉంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy