నమ్మలేని నిజం: కవలలే భార్యాభర్తలు

holding-handsభార్యభర్తల సంబంధానికి తోబుట్టువులను అస్సలు ఊహించలేం. అంత పవిత్రంగా భావిస్తాం. కానీ అమెరికాలోని మిసిసిప్పీలో ఇది జరిగింది. అయితే ఈ విషయం డీఎన్ఏ టెస్ట్ జరిగే వరకు వారికి తెలియదు. వారిద్దరు కవలలు. ఒకరు ఆడ.. మరొకరు మగ. చిన్నతనంలో ఓ ప్రమాదంలో అమ్మానాన్నలు చనిపోతే.. వారిద్దరిని.. రెండు వేరు వేరు కుటుంబాలు దత్తత తీసుకున్నాయి. ఆ తర్వాత ఒకరి గురించి మరొకరికి తెలియదు. ఏళ్లు గడిచిపోయాయి.

పెద్దైన తర్వాత అనుకోకుండా ఇద్దరూ ఒకే కాలేజీలో చేరారు. ఒకరోజు ఒకరిని ఒకరు చూసుకుని నమ్మలేకపోయారు. ఇద్దరి మధ్య పొలికలు ఉండడంతో స్నేహం చిగురించింది. స్నేహం కాస్తా ప్రేమగా మారింది. దీంతో పెళ్లి కూడా చేసుకున్నారు. అంతాబాగానే ఉంది. ఈ క్రమంలో టెస్ట్ ట్యూబ్ ఫలదీకరణకు సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ఓ హాస్పిటల్‌కి వెళ్లారు. అక్కడ ఇద్దరికీ డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించిన వైద్యులు షాక్‌కు గురిచేసే విషయాన్ని చెప్పారు. భార్యాభర్తలిద్దరూ కవల పిల్లలని, తోబుట్టువులని నిర్థారించారు. దీంతో ఆ జంటతోపాటు అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. భార్యభర్తల పేర్లను వైద్యులు వెల్లడించలేదు. కానీ విషయాన్ని మీడియాకు తెలిపారు. స్థానిక చట్టాల ప్రకారం తోబుట్టువులు పెళ్లి చేసుకుంటే 10 ఏళ్ల జైలుశిక్షతోపాటు 32 వేల రూపాయల జరిమానా విధించాల్సి ఉంది. కానీ వారిద్దరికీ తోబుట్టువులనే విషయం తెలియదు, ఉద్దేశ్యపూర్వకంగా పెళ్లి చేసుకోలేదు. కావునా వీరిద్దరిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని మీడియా ప్రకటనలో తెలిపారు. ఆసక్తికరమైన ఈ ఘటన అమెరికాలోని మిస్సిసిపి నగరంలో వెలుగులోకి వచ్చింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy