నయీమ్ కథ కంచికి చేరెదెన్నడు..?

nayeem-gunనయీమ్ ఎన్ కౌంటర్ జరిగి ఏడాదైంది. నయీం చేసిన అరాచకాలపై పోలీసులు చాలా రోజులు ఎంక్వైరీ చేశారు. ఆరోపణలు వచ్చిన చాల మందిపై కేసులు కూడ వేశారు. నయీంతో ఉన్న సంబంధాల గురించి తెలుసుకున్నారు. మరి.. ఆ విచారణ ఎక్కడి వరకు వచ్చింది? ఏడాది పాటు జరిగిన విచారణలో ఏం తేలింది?

20 ఏండ్లపాటు.. దందాలు చేసిన నయీంను.. పోలీసులు ఎన్ కౌంటర్ చేసి ఏడాదైంది. గత ఏడాది ఆగస్టు 8న.. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ మిలీనియం టౌన్ షిప్ ల.. కాల్పులల్ల నయీం చనిపోయిండు నయీం. తెలంగాణ రావడానికి ముందు.. నయీం లింకులను కూడా టచ్ చేయని పోలీసులు.. తర్వాత… అందుకు భిన్నంగా.. అతన్ని ఎన్ కౌంటర్ చేయడం.. పెద్ద సంచలనమైంది. తర్వాత నయీంతో సంబంధమున్న చాలా మందిపై విచారణ జరిగింది. నయీంపై ఉన్న 100కు పైగా కేసులు.. 20 కి పైగా మర్డర్ కేసులపై గూడ.. పోలీసులు ఎంక్వైరీ చేశారు.

నక్సలైట్ గా నేర చరిత్ర మొదలు పెట్టిన నయీం.. తర్వాత చాలా హత్య కేసులలో యాక్టివ్ రోల్ ప్లే చేశాడు. హైద్రాబాద్ ఎల్బీ స్టేడియంలో ఐపీఎస్ వ్యాస్ ను కాల్చి చంపిన కేసు.. ప్రజా గాయకురాలు బెల్లి లలిత హత్య కేసు.. టీఆర్ఎస్ నేత సాంబశివుడు, మాజీ నక్సలైట్ పటోళ్ల గోవర్దన్ రెడ్డి, రాములు హత్య కేసులలో నిందితుడిగా ఉన్నాడు నయీం. వీటిపై విచారణ చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం.. నయీంకు పోలీసులతో ఉన్న లింకులపై వివరాలు రాబట్టింది. భువనగరి కోర్టులో చార్జ్ షీట్ లో.. సాక్షి నంబర్ 31 గ ఉన్న మల్లికార్జున్ ఇచ్చిన సమాచారంతో.. సీఐ గండికోట వెంకటయ్య పేరును సిట్ కోర్టులో సబ్మిట్ చేసింది. అలాగే.. 29వ సాక్షి యూసుఫ్ వాంగ్మూలంలో సీఐ మస్తాన్ అలీ పేరు.. 32వ సాక్షి నాగేంద్ర ప్రసాద్ వాంగ్మూలంలో ఏఎస్పీ మద్దిపాటి శ్రీనివాసరావు.. 33వ సాక్షి శివరాం ప్రసాద్ వాంగ్మూలంలో డీఎస్పీ ఎం. శ్రీనివాసరావు పేరు.. 36వ సాక్షి నర్సింహారెడ్డి వాంగ్మూలంలో సీఐ బూర రాజగోపాల్ పేరు.. 38వ సాక్షి వెంకటరామయ్య వాంగ్మూలంలో డీఎస్పీ సాయి మనోహర్ పేర్లనె.. సిట్ కోర్టుకు సబ్మిట్ చేసింది.

అయితే.. ఈ వాంగ్మూలం బాధితులకే పరిమితం కావడం.. నయీం దందా చేసి లాక్కున్న భూములు, ఆస్తులకు సంబంధించి.. రిజిస్ట్రేషన్లు పక్కాగా ఉండడంతో.. విచారణకు మధ్య మధ్యలో బ్రేకులు పడుతున్నాయి. అలాగే.. మన రాష్ట్రంతో పాటు.. ఏపీ, గోవా, ఛత్తీస్ గఢ్ లో ఉన్న ఆస్తులను కూడా.. తన సంబంధికుల పేర్లతో నయీం పక్కాగా రిజిస్ట్రేషన్ చేయించినట్టుగా సిట్ విచారణలో తేలింది. వాటిని జప్తు చేయడం.. అంత ఈజీ కాదనే విషయం… న్యాయ నిపుణులు గూడ.. పోలీస్ శాఖకు చెప్పినట్టు తెలుస్తుంది.  అలాగే..  భువనగిరి.. యాదాద్రి.. మిర్యాలగూడ.. షాద్ నగర్.. కల్వకుర్తి.. శంషాబాద్.. నార్సింగి.. నల్లగొండలోని తమ ప్రాంతాలల్ల.. నయీం భూములు లాక్కున్నాడని.. 204 మంది సిట్ కు ఫిర్యాదు చేశారు. కానీ.. ఏండ్ల కింద జరిగిన కబ్జాలలో ఎట్లా ఆధారాలు సేకరించాలన్నది.. పోలీసులకు సవాల్.

విచారణలో నయీం డెన్ లో నుంచి బస్తా ఫొటోలు.. నయీం పర్సనల్ డైరీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో.. ప్రముఖుల పేర్లు, వాళ్లతో నయీం దిగిన ఫొటోలు ఉన్నట్టు.. అప్పట్లో వార్తలొచ్చినాయి. అదే టైమ్ లో.. చాలా మంది పెద్దలు బయటికొచ్చి.. నయీంతోని తమకు సంబంధం లేదని వివరణ కూడ ఇచ్చుకున్నారు. అవన్నీ పోను..  ఇప్పటి వరకు మొత్తం నయీం దందాకు సంబంధించి.. 174 కేసులు పెట్టి.. 116 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. 848 సాక్ష్యాలు నమోదు చేశారు. 5 చార్జ్ షీట్లు కూడ దాఖలు చేశారు. కానీ.. నయీం ప్రధాన అనుచరులు శేషన్న అండ్ టీమ్ ఆచూకీని మాత్రం బయటపెట్టలేకపోయారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy