నయీమ్ ను వేసేసిన తర్వాత..

nayeemకళ్లు చెదిరే ఆస్తులు…వేల ఎకరాల భూములు…వందల సంఖ్యలో ఇండ్ల డాక్యూమెంట్లు. వందలాది సెల్ ఫోన్లు… ..ఎక్కడ అడ్డా పెడితే అక్కడ…తన సామ్రాజ్యం విస్తరించాలి. తను సైగ చేస్తే…ఎదుటి వ్యక్తి ఎంతటి వారైనా.. తను చెప్పినట్లు నడుచుకోవాల్సింది. రాష్ట్రంలో తనకంటూ ప్రత్యేక చీకటి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న మోస్ట్ వాంటెడ్ నయీం హతం తర్వాత…అసలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల సోదాల్లో కళ్లు చెదిరే నిజాలు బయట పడుతున్నాయి.

నయీం ఆస్తులతో స్టన్ అవుతున్న అధికారులు…చీకటి సామ్రాజ్యానికి సహకరించింది ఎవరు…నయీంతో పాటు కలిసి పనిచేసిన అధికారుల..రాజకీయ నాయకులు దృష్టి పెడుతున్నారు అధికారులు. ఇప్పటికే కొంత మంది పోలీస్ అధికారులను అదుపులోకి తీసుకొని విచారించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు నయీంకు మద్దతు పలికిన రాజకీయ నాయకులపై కూడా అధికారులు కన్నేశారు.

నయీం బంధువులు, అనుచరుల ఇళ్లపై పోలీసుల సోదాలు కొనసాగుతున్నాయి. నయీం కూడబెట్టిన ఆస్తుల వివరాలు సేకరించే పనిలో పడ్డారు అధికారులు. ఇంజాపూర్ లోని నయీం అనుచరుడు శ్రీధర్ ఇంటిపై పోలీసులు దాడులు జరపగా.. అతను పారిపోయాడు. శ్రీధర్ ఇంట్లో భారీగా ఆస్తులు గుర్తించారు. స్పాట్ లో 40లక్షలు, 3 తుపాకీలు… భారీగా ల్యాండ్ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు.

అల్కాపురి టౌన్ షిప్ లో నయీం బావమరిది ఇంట్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. నిన్న 2 కోట్ల డబ్బు, 2కిలోల బంగారం, 4 తుపాకీలతో పాటు బినామీల పేరుతో ఉన్న ల్యాండ్ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఆస్తుల పేపర్లు చూసి అధికారులే ఆశ్చర్యపోతున్నారు. ల్యాండ్ డాక్యుమెంట్ల విషయంలో.. రెవెన్యూ అధికారుల సాయం తీసుకుంటున్నారు. నల్గొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, భువనగిరి, చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపూర్ లోనూ నయీం భారీగా భూములు కొనుగోలు చేసినట్లు అధికారులు భావిస్తున్నారు.

నిన్న నయీం చనిపోయిన ఇంటిదగ్గరకు సంవత్సరం నుంచి వచ్చి వెళ్తున్నాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. నయీంతో పాటు చాలామంది వస్తుంటారని అంటున్నారు. నయీంను షూట్ చేయకముందు షాద్ నగర్ లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురూ నయీం అనుచరులుగా భావిస్తున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy