నరేంద్ర మోడీ హర్డ్ వర్కర్: కరుణానిధి

M.-KARUNANIDHIఎన్నికలు సమీపిస్తున్నాయి.దేశ వ్యాప్తంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని సర్వేలు చెప్తుండటంతో మోడీతో పొత్తు కోసం ఆతన్ని పొగడ్తల్తో ముంచేత్తుతున్నారు నాయకులు. మన రాష్ట్రం నుంచి చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం నేతలు ప్రయత్నిస్తున్నారు.

తాజాగా నరేంద్ర మోడీని ప్రసంశలతో ముంచెత్తారు DMK అధినేత కరుణానిధి. తనకు నరేంద్ర మోడీ చాలా మంచి స్నేహితుడని,ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన చాలా కష్టపడుతున్నాడని కరుణానిధి చెప్పారు. ఆయన ప్రత్యర్ధి అయిన జయలలిత కూడా మోడీ గుడ్ ఫ్రెండ్ అని అన్నారు. బీహర్ నుంచి ఎల్జేపీ కూడా తిరిగి బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో బలమైన పార్టీగా బీజేపీ ఉంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో బీజేపీతో కలిసి ఉన్న రాంవిలాస్ పాశ్వాన్ గుజరాత్ లో
అల్లర్ల కారణంగా ఎన్డీఏ నుంచి వైదోలిగాడు.

ఇక DMK 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తూ వచ్చింది. అయితే 2009లో తమిళ ప్రజలపై శ్రీలంక చేస్తున్న అకృత్యాలకు విషయంలో కాంగ్రెస్ కు తీరు నచ్చకపోవడంతో మద్దతు ఉపసంహరించుకుంది. బీజేపీతో పొత్తు కోసం కరుణానిధి ప్రయత్నాలు చేస్తుంటే కొడుకు స్టాలిన్ మాత్రం విభేధిస్తున్నాడని సమాచారం.

మోత్తానికి బీజేపీతో పొత్తు కోసం అన్ని పార్టీలు ఎదురు చూస్తున్నాయి. అందుకే ఇప్పటి నుంచే విమర్శలకు దూరంగా ఉంటూ మోడీని ప్రసంశలతో ముంచెత్తుతున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy