నరేష్, సునీల్ మల్టీస్టారర్ : సిల్లీ ఫెలోస్ ఫస్ట్ లుక్

CILLIసూర్యవంశం, సుస్వాగతం లాంటి సూపర్ హిట్ సినిమాలో డైరెక్షన్ తో అదరగొట్టిన డైరెక్టర్ భీమనేని శ్రీనివాస్. ఆయన లేటెస్ట్ గా సునీల్, అల్లరి నరేష్ హీరోలుగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు శుక్రవారం (జూన్-8) టైటిల్ ను ఫిక్స్ చేశారు.

సిల్లీఫెలోస్ అనే టైటిల్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేసిన యూనిట్..ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాలో రకుల్, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటించనున్నట్లు టాక్.  ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలిపింది యూనిట్.  సునీల్, నరేష్ కామెడీ పండించడంలో అదుర్స్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాలోని ఫస్ట్ లుక్, టైటిల్ చూస్తుంటే ప్రేక్షకులకు ఫుల్ కామెడీ ఉంటుందని తెలుస్తుంది.  నరేష్ తో ఇంతకుముందు భీమినేని శ్రీనివాస్ సుడిగాడు అనే సినిమాను  తీసి ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy