నరైన్ మ్యాజిక్ ‘మేడిన్’ బౌలింగ్..

hi-res-176717206-sunil-narine-of-guyana-amazon-warriors-bowls-a-maiden_crop_exactసంచనాలకు కేరాఫ్ గా టీ20 క్రికెట్ మారుతోంది. హై స్కోర్ కొట్టి ఒకరు రికార్డ్ క్రియేట్ చేస్తే..దాన్ని ఛేజ్ చేసి మరో టీం రికార్డ్ బ్రేక్ చేస్తుంది. ఒకరు వరుసగా నాలుగు సిక్సులు కొడితే మరోకరు ఒక ఓవర్లో ఆరు సిక్స్ లు కొడతారు. 20 ఓవర్ల క్రికెట్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఉహించలేరు. ఇక తాజాగా వెస్టిండీస్ బౌలర్ సునీల్ నరైన్ రికార్డ్ క్రియేట్ చేశాడు. మామూలుగా మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ మ్యాచ్ నిర్వహిస్తారు. ఆ ఒక్క ఓవర్ మ్యాచ్ ఎవరిదనేది డిసైడ్ చేస్తుంది.

20 ఓవర్ల మ్యాచ్ లోనే రెచ్చిపోయే బ్యాట్స్ మెన్ ఒక్క ఓవర్లో మరింత రెచ్చిపోతాడు. అయితే ఇక్కడే ట్విస్ట్ జరిగింది. విండీస్ బౌలర్ సునీల్ నరైన్  ఒక్క రన్ కూడా ఇవ్వలేదు. ఇప్పటి వరకూ జరిగిన సూపర్ ఓవర్లలో ఇదే మేడిన్ ఓవర్ కావడం విశేషం. ఇది కొత్త రికార్డ్ కూడా. కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో అతను ఈ రికార్డ్ క్రియేట్ చేశాడు. రెడ్ స్టీల్, గుయానా అమెజాన్ టీంల మధ్య జరిగిన మ్యాచ్ లోనే ఈ రికార్డ్ నమోదైంది. దీంతో సూపర్ ఓవర్లో తన దైన స్పిన్ బౌలింగ్ తో నరైన్ మాయ చేశాడు. తన మ్యాజిక్ బౌల్స్ తో రెడ్ స్టీల్ ను ఒక్క రన్ కూడా చేయనీయలేదు. రికార్డ్ తో పాటు టీంకు విజయాన్ని కూడా అందించాడు నరైన్.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy