నర్సాపూర్….ప్రగతిలో పూర్!

ఆంధ్రప్రదేశ్ కు మొదటి డిప్యూటీ సీఎంను అందించిన నియోజకర్గం. క్రియాశీలక రాజకీయాలకు కేంద్రంగా ఎదిగిన ప్రాంతం. జిల్లాలో మంత్రి పదవులకు పెట్టనికోటలాంటి సెగ్మెంట్. అదే మెదక్ జిల్లాలోని నర్సాపూర్ నియోజకవర్గం. సెగ్మెంట్ నుండి డీప్యూటీ సీఎంతో పాటు ఎంతోమంది మంత్రులుగా ఎంపికైనా అభివృద్ధిలో వెనకబడే ఉంది. నర్సాపూర్ నియోజకవర్గంపై స్పెషల్ స్టోరీ.

  • నర్సాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో నర్సాపూర్, వెల్దుర్తి, శివ్వంపేట, కౌడిపల్లి, హత్నుర్, కుల్చారం మండలాలున్నాయి.
  • సెగ్మెంట్ లో మొత్తం ఓటర్ల సంఖ్య లక్షా 92 వేల 101.
  • మహిళా ఓటర్లు 96 వేల 621 మంది.
  • పురుష ఓటర్లు 93 వేల 623 మంది.
  • నియోజక వర్గంలో అగ్రకులాలు 5 శాతం, ఎస్సీలు 15 శాతం, ఎస్టీలు 7 శాతం, ముస్లింలు 10 శాతం, 44 శాతం బీసీలు వున్నారు.

…………………..

  • నర్సాపూర్ నియోజకవర్గం 1952 లో ఏర్పడింది.
  • అప్పటినుంచి బీసీ నేతలు, రెడ్డి కులస్తులే ఎంఎల్ఎలుగా గెలుస్తూ వస్తున్నారు.
  • 1952 లో జయరాం రెడ్డి, 1957 లో గుండం వీరయ్య గెలిచారు.
  • 1967, 72, 83లో కాంగ్రెస్ కు చెందిన సీ. జగన్నాధ రావు గెలిచారు.
  • రాష్ట్రంలో మొట్టమొదటి ఉప ముఖ్యమంత్రి  అయ్యారు జగన్నాథరావు.
  • డిప్యూటీ సీఎం అయినా తర్వాతికాలంలో సీపీఐ లీడర్ విఠల్ రెడ్డితో పోటీ పడలేకపోయారు జగన్నాథ రావు.
  • 1962, 78, 85, 89, 94లో చిలుమల విఠల్ రెడ్డి గెలిచారు.
  • నాలుగు దశాబ్దాల పాటు విజయం వీళ్లిద్దరి మధ్యే దోబూచులాడింది.
  • జగన్నాథ రావు, విఠల్ రెడ్డి శకం ముగిశాక  ఈ స్థానాన్ని సునీతా లక్ష్మారెడ్డి ఏలుతున్నారు.
  • నర్సాపూర్ జెడ్పీటీసీగా ఉన్న తన భర్త వి.లక్ష్మా రెడ్డి మరణంతో అనూహ్యంగా రాజకీయాల్లోకొచ్చారు సునీతా లక్ష్మారెడ్డి.
  • 1999, 2004, 2009 ఎన్నికల్లో గెలిచి హేట్రిక్ సాధించారు.
  •  వైఎస్ కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు సునీత.
  • వైఎస్ తర్వాత రోశయ్య, కిరణ్ కేబినెట్ లో కూడా ఆమె మంత్రిగా కొనసాగారు.
    ………………….
  • హ్యాట్రిక్ విజయం సాధించిన సునీతా లక్ష్మారెడ్డి ఈసారి ఎన్నికల్లోనూ విజయంపై కన్నేశారు.
  • నియోజకవర్గంలో బూత్ స్థాయిలో ఆమెకు సత్సంబంధాలున్నాయి.
  • ఇటు స్వపక్షంలోనూ, అటు విపక్షంలోనూ సరైన ప్రత్యర్థి లేకపోవడం ఆమెకు ప్లస్ పాయింట్.
  • ఇక టీడీపీ, లెఫ్ట్ పార్టీలు చాలాకాలం నుంచే ఉనికిలో లేవు. ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
  • పదిహేనేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న సునీతా లక్ష్మారెడ్డి నర్సాపూర్ లో విద్యావకాశాలను మెరుగుపరిచారంటున్నారు స్థానికులు.
  • రెండు గ్రామాలకు ఓ సబ్ స్టేషన్ చొప్పున విద్యుత్ సౌకర్యాలను మెరుగుపరిచారు.

………………….

  • మూడుసార్లు ఎంఎల్ఏగా గెలిచినా, మంత్రిగా బాధ్యతలు చేపట్టినా మంజీరా నీళ్లను అన్ని గ్రామాలకు అందించలేకపోయారన్న విమర్శలు సునీతపై ఉన్నాయి.
  • ఆ హామీతోనే అధికారంలోకొచ్చారని, దాన్ని మర్చిపోయారన్నది స్థానికుల విమర్శ.
  •  మంత్రిగా బాధ్యతలు చేపట్టినా నియోజకవర్గంలో వీలైనప్పుడల్లా పర్యటించడం సునీతా లక్ష్మారెడ్డికి అలవాటు. అయితే ప్రచార ఆర్భాటాలే తప్ప రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించడంలో మంత్రి విఫలమయ్యారంటున్నారు స్థానికులు.
  • స్థానికంగా తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉండటం… ఆశించిన స్థాయిలో అభివృద్ధి పనులు చేయలేకపోయారన్న విమర్శలు సునీతకు మైనస్ గా మారే అవకాశముంది.

సునీత మహిళా శిశుసంక్షేమశాఖలో ఉన్నా నియోజకవర్గంలో పిల్లల విక్రయాలు అధికంగా వుండటంతో అదో మైనస్ అయింది. ప్రత్యర్థులకు అది విమర్శనాస్త్రంగా ఉపయోగపడే అవకాశముంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy