ముగ్గురి పోటీలో పెద్దపల్లి

విప్లవాల పురిటిగడ్డ ఆ ప్రాంతం. ఒకప్పుడు మావోయిస్టులు, పోలీసుల బూట్ల చప్పుళ్లు వినిపించేవి. కొన్నాళ్ల క్రితం వరకు తెలంగాణ ఉద్యమాలతో హోరెత్తింది. చారిత్రక కట్టడాలు, ప్రకృతి గుట్టలకు నెలవైన నియోజకవర్గం. అదే కరీంనగర్ లోని పెద్దపల్లి సెగ్మెంట్. ఎన్నికల నగారా మోగడంతో పెద్దపల్లిలో పొలిటికల్ హీట్ మొదలైంది. పెద్దపల్లి సెగ్మెంట్ పై స్పెషల్ స్టోరీ.

  • పెద్దపల్లి నియోజకవర్గంలో మొత్తం ఆరు మండలాలున్నాయి.
  • పెద్దపల్లి, సుల్తానాబాద్, ఓదెల, కాల్వశ్రీరాంపూర్, ఎలిగేడు, జూలపల్లి మండలాల్లో మొత్తం 102 గ్రామాలున్నాయి.
  • పెద్దపల్లి సెగ్మెంట్ లో మొత్తం ఓటర్ల సంఖ్య 2 లక్షల 14 వేల 763.
  • పురుష ఓటర్లు లక్షా 8 వేల 689.
  • మహిళా ఓటర్లు లక్షా 6 వేల 074.
  • నియోజకవర్గంలో 70శాతం బీసీలే.
  • ఎస్సీలు 14 శాతం. ఇతరులు 16 శాతం వరకు ఉన్నారు.
  • పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపుంది.
  • 1952 లో పెద్దపల్లి నియోజకవర్గం ఏర్పడింది.
  • ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోట ఈ ప్రాంతం.
  • అప్పట్లో పోలీసులు, మావోయిస్టుల బూట్ల చప్పులు పల్లెలో వినిపించేవి.
  • మావోయిస్ట్ అగ్రనేత మల్లోజుల కోటేశ్వర్ రావు పుట్టింది ఈ ప్రాంతంలోనే.
  • విప్లవ భావాలున్న పెద్దపల్లి ఓటర్లు ఏ నేతను అంత ఈజీగా నమ్మరు.
  • నమ్మితే వరుసగా అతనికే అధికారాన్ని కట్టబెడుతారని చాలాసార్లు రుజువైంది.
    …………………….
  • 1952లో సుల్తానాబాద్, పెద్దపల్లి నియోజకవర్గాలు రెండు ఉండేవి.
  • తర్వాత 1967లో రెండు కలిపి పెద్దపల్లి నియోజకవర్గంగా ఏర్పడింది.
  • అప్పటినుండి రాజకీయంగా కరీంనగర్ జిల్లాలో ప్రత్యేకత చాటుకుంది.
  • 1962, 67లో  జన్నా మల్లారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు.
  • తర్వాత కాంగ్రెస్ లో చేరిన జన్నా మల్లారెడ్డి 1972, 1978లో రెండుసార్లు గెలిచారు.
  • ఆ తర్వాత 1978లో జి. రాజిరెడ్డి కాంగ్రెస్ నుంచి గెలుపొందారు.
  • 1983లో గోనె ప్రకాశ్ రావు సంజయ్ విచార్ మంచ్ పార్టీ నుంచి గెలవడం అప్పట్లో సంచలనం.
  • 1984, 89లో గీట్ల ముకుందరెడ్డి కాంగ్రెస్ నుంచి గెలుపొందారు.
  • 1994లో బిరుదు రాజమల్లు టీడీపీ నుంచి గెలిచారు.
  • 1999 లో బీజేపి నుంచి గుజ్జుల రామకృష్ణా రెడ్డి  ఎమ్మెల్యేగా గెలిచారు.
  • 2004లో టీఆర్ఎస్ నుంచి గీట్ల ముకుందరెడ్డి విజయం సాధించారు.
  • ఓవరాల్ గా 1972 తర్వాత నాలుగుసార్లు కాంగ్రెస్, మూడుసార్లు టీడిపీ అభ్యర్థులు గెలిచారు.
    ………………
  • 2009 ఎన్నికల్లో టీడిపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన విజయరమణారావు గెలిచారు.
  • మహాకూటమి పొత్తులో భాగంగా ఈ సీటును టీఆర్ఎస్ కు కేటాయించారు.
  • టీఆర్ఎస్ తరుపున సత్యనారాయణ రెడ్డి నిలుచున్నారు.
  • కాంగ్రెస్ నుంచి గీట్ల ముకందరెడ్డి బరిలో నిలిచారు.
  • అయితే రెబల్ గా బరిలోదిగిన విజయరమణారావు అనూహ్యంగా విజయం సాధించారు.
    ………………..

ఈసారి ఎన్నికల్లో విజయరమణారావు గెలుపు అంత ఈజీగా కాదన్న అంచనాలున్నాయి. తెలంగాణ విషయంలో టీడీపీ నిర్ణయాలు విజయరమణారావుకు మైనస్ గా మారాయి. దాంతోపాటు అనుకున్నంత అభివృద్ది చెయ్యలేదన్న విమర్శలున్నాయి. విజయరమణారావు ఎమ్మెల్యే అయ్యాక కరీంనగర్ జిల్లా టీడీపీ అద్యక్ష బాధ్యతలు చేపట్టారు. జిల్లాలో టీడీపీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేశారు. ఆ ప్రయత్నాల్లో సెగ్మెంట్ ను  పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి.

  • పెద్దపల్లికి బస్సు డిపోను తీసుకొస్తానన్న హామీని మర్చిపోయారు.
  • పెద్దపల్లి బస్టాండ్ లో మౌలిక వసతులు కల్పించలేదన్నది మరో విమర్శ.
  • ఎన్నో ఏళ్ళుగా ఉన్న మంచినీటి కొరతను ఎమ్మెల్యే తీర్చలేకపోయారన్న విమర్శ కూడా ఉంది.
  • నీటిసమస్యలు తీర్చడానికి పక్కా ప్రణాళికలు లేవు.
  • పెద్దపల్లి సెగ్మెంట్ లో సాగునీటి సమస్యలూ ఎక్కువే.
  • పెద్దపల్లిలో బస్సుడిపోతో పాటు మినీ స్టేడియం నిర్మించాలన్నది మరో డిమాండ్. అదీ తీరలేదు.

2014 ఎన్నికల్లో గెలుపు కోసం విజయరమణారావు రెడీ అయ్యారు. ఊరూరా పాదయాత్రలు చేస్తున్నారు. టీడీపీ హయంలోనే రోడ్లు, హాస్పిటల్స్, స్కూల్స్ వచ్చాయని చెప్పి తననే గెలిపించాలని కోరుతున్నారు. అభివృద్ధి  చేయాలన్న తపన ఉన్నా అపోజిషన్ లో ఉన్న కారణంగా పూర్తిస్థాయిలో నిధులు రాబట్టలేకపోయానని అంటున్నారాయన.

  • విజయరమణారావుకు పోటీగా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు దిగుతున్నారు.
  • దీంతో ఎమ్మెల్సీ భానుప్రసాద రావు గ్రామస్థాయిలో కేడర్ ను తయారుచేసుకునే పనిలో పడ్డారు.
  • కొంతకాలంగా పెద్దపల్లి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
  • తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న నేపథ్యం, లోకల్ వ్యక్తి కావడం, అందరితో సత్సంబంధాలుండటం భానుప్రసాదరావుకు కలిసొచ్చే అంశాలు.

ఉద్యమ పార్టీగా కరీంనగర్ జిల్లాలో పట్టున్న టీఆర్ఎస్ కు పెద్దపల్లిలో మాత్రం కేడర్ వీక్ గా ఉంది.

  • 2004 లో టీఆర్ఎస్ నుండి గెలిచిన గీట్ల ముకుందరెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లారు.
  • ఇక పెద్దపల్లి ఎంపీ వివేక్ టీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చేయడం ఇక్ ఆ పార్టీకి మైనస్ గా మారే అవకాశం ఉంది.
  • టీఆర్ఎస్ నుంచి దాసరి మనోహర్ రెడ్డి బరిలో ఉన్నారు.
  • ఉద్యమాల్లో పాల్గొనడం, అత్యధిక సర్పంచ్ లు పార్టీనుంచి గెలవడం మనోహర్ కు కలిసొచ్చే అంశాలు.
  • వైసీపీ నుంచి ఎంఏ ముస్తాక్ బాషా పోటీకి దిగుతున్నారు.

శ్రీశైలం మల్లన్న తర్వాత  అంతటి ప్రశస్తి ఉన్న ఆలయం ఓదెల మల్లన్న ఆలయం. ఇన్నాళ్ళూ ఈ ఆలయాన్ని పాలకులు పట్టించుకోలేదు. దాన్ని పుణ్యక్షేత్రంగా, పర్యాటక స్థలంగా మార్చాలన్న డిమాండ్ ఏళ్ళుగా ఉంది. దానితో పాటు సెగ్మెంట్ లోని సమస్యలను తీర్చే అభ్యర్థికే పట్టం కడతామంటున్నారు ఓటర్లు. ఏదైతేనేం, పెద్దపల్లిలో ఈసారి త్రిముఖ పోరు తప్పదన్న అంచనాలున్నాయి.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy